చార్టెడ్‌ ఫ్లైట్‌ కొనుగోలు చేయనున్న టీఆర్‌ఎస్‌

చార్టెడ్‌ ఫ్లైట్‌ కొనుగోలు చేయనున్న టీఆర్‌ఎస్‌

హైదరాబాద్: జాతీయపార్టీ పెట్టేందుకు సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా తిరిగేందుకు సొంత విమానం కొనుగోలు చేయాలని కేసీఆర్ భావించారు. అందుకోసం త్వరలో చార్టెడ్‌ ఫ్లైట్‌‌ను టీఆర్‌ఎస్‌ కొనుగోలు చేయనుంది. 12సీట్లు ఉన్న చార్టెడ్ ఫ్లైట్ కోసం రూ. 80కోట్లు టీఆరెఎస్ ఖర్చు చేయనుంది. ఈ మొత్తాన్ని విరాళాల ద్వారా సేకరించనున్నారు. అయితే విరాళాల ఇచచేందుకు టీఆర్‌ఎస్ నేతలు పోటీ పడుతున్నారు. ఇప్పటికే పార్టీ ఖజానాలో 865కోట్ల రూపాయలున్నట్లు చెబుతున్నారు. దసరా రోజు జాతీయ పార్టీ ప్రకటన అనంతరం కొత్త విమానానికి ఆర్డర్ చేస్తారని టీఆర్‌ఎస్ నేతలు చెబుతున్నారు. ప్రత్యేక సొంత విమానం ఉన్న పార్టీగా టిఆర్ఎస్‌కు త్వరలో గుర్తింపు రానుంది. దసరా తర్వాత కేసిఆర్ సుడిగాలి పర్యటనలకోసం ఇప్పటికే రూట్‌ మ్యాప్‌ ఖరారు చేశారు.

కేసీఆర్‌ జాతీయ రాజకీయ పార్టీ ప్రకటనకు ముహూర్తాన్ని ఖరారు చేసినట్లు చెబుతున్నారు. ముందుగా నిర్ణయించినట్లుగానే అక్టోబరు 5న దసరా పండుగ రోజే ఆయన నూతన రాజకీయ పార్టీని ప్రకటించనున్నారు. అదే రోజు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో కేసీఆర్ సమావేశం నిర్వహిస్తారు. అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత పార్టీని కేసీఆర్ ప్రకటిస్తారని అంటున్నారు. బుధవారం మధ్యాహ్నం 1:19 గంటలకు జాతీయ పార్టీ ప్రకటన ఉంటుందని టీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published.