రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారులను గుర్తించడం అభినందనీయం: రాధాకృష్ణ, bcjac హైదరాబాద్ ప్రెసిడెంట్

రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారులను గుర్తించడం అభినందనీయం: రాధాకృష్ణ, BCJAC హైదరాబాద్ ప్రెసిడెంట్

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారులను గుర్తించడం అభినందనీయమని తాటి రాధాకృష్ణ పేర్కొన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఉద్యమకారుడు శుభప్రద్ పటేల్ కు రాష్ట్ర ప్రభుత్వం బీసీ కమిషన్ సభ్యుడిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ సందర్భంగా బీసీ jac హైదరాబాద్ ప్రెసిడెంట్ తాటి రాధాకృష్ణ ఆర్.బి.ఎం మీడియాతో మాట్లాడుతూ మలిదశ ఉద్యమ వీరుడు శుభప్రద్ పటేల్ ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి బీసీ కమిషన్ సభ్యునిగా నియమించడంతో ఉద్యమకారులకు తగిన గుర్తింపునిచ్చారని రాధాకృష్ణ హర్షం వ్యక్తం చేశారు.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం శుభప్రద్ పటేల అలుపెరగని పోరాటం చేశారని రాధాకృష్ణ అన్నారు.ఉద్యమ సమయంలో శుభప్రద్ పటేల్ పై అనేక అక్రమకేసులు పెట్టారని పోలీసులు ఎన్నిసార్లు అరెస్ట్ చేసిన ఎన్ని కేసులు నమోదు చేసిన అయన మాత్రం ఉద్యమాన్ని అపలేదని రాధాకృష్ణ తెలిపారు.

అంతేకాదు ఒవైపు తెలంగాణ ఉద్యమం, మరోవైపు రాజకీయ పోరాటంలో శుభప్రద్ పటేల్ పాత్ర చాలా గొప్పది అని రాధాకృష్ణ అన్నారు. కేసీఆర్ పిలుపుతో పటేల్ ఎన్నో కార్యక్రమాలు చేసే వారని పటేల్ తెగువను, చొరవను చూసిన కేసీఆర్.. ‘ఉద్యమపులి’ అని సంబోంధిన సందర్భాలెన్నో ఉన్నాయని రాధాకృష్ణ చెప్పుకొచ్చారు.

బీసీ కమిషన్ సభ్యుడిగా నియామకం అయిన శుభప్రద్ పటేల్ కు రాధాకృష్ణ శుభాకాంక్షలు తెలియజేశారు. మలిదశ ఉద్యమంలో శుభప్రద్ పటేల్ నాయకత్వంలో పోరాటాలు చేయడం అదృష్టంగా భావిస్తున్నాను అని బీసీ jac హైదరాబాద్ ప్రెసిడెంట్ రాధాకృష్ణ ఆర్.బి.ఎం మీడియాకు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published.