గీత దాటితే..తప్పదు ఫైన్ జాగ్రత్త

హైదరాబాద్ : నగరాల్లో కొత్త ట్రాఫిక్‌ రూల్స్ అమల్లోకి వస్తున్నాయి. సిగ్నల్స్‌ వద్ద స్టాప్‌ లైన్‌ దాటితే ఇక ఫైన్ తప్పదు..వాహనదారులు ఇక అప్రమత్తంగా ఉండాలిని సూచించారు. పోలీసులు రెండంచల స్పెషల్‌ డ్రైవ్‌ను సోమవారం ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా రోడ్డుకు అడ్డంగా వాహనాలు నిలిపిన వారికి ఉల్లంఘన తీవ్రత, వాహనాన్ని బట్టి రూ.100 నుంచి రూ.1,000 వరకు జరిమానా విధించనున్నారు. రోడ్డుపై నిలిపిన బైకులకు రూ.100జరిమానాతోపాటు టోయింగ్‌చార్జీలు రూ.200, అదేవిధంగా కారుకు రూ.100 జరిమానాతోపాటు టోయింగ్‌ చార్జీలు రూ.600 వసూలు చేయనున్నారు. జీబ్రా క్రాసింగ్‌ల వద్ద స్టాప్‌లైన్‌ను దాటి ముందుకు వచ్చిన వాహనాలకు రూ.200జరిమానా, సిగ్నళ్ల వద్ద ఎడమ వైపు(ఫ్రీ లెఫ్ట్‌)కు అడ్డంగా వాహనాలు నిలిపితే రూ.1,000జరిమానా విధించనున్నారు.

Leave a Reply

Your email address will not be published.