కేంద్రమంత్రులపై కేసీఆర్ ఫైర్…

వరంగల్: వరంగల్ జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు శనివారం పర్యటించారు ములుగు క్రాస్ రోడ్ ( ఆరెపల్లి – దామెర క్రాస్ రోడ్డు )వద్ద ప్రతిమ రిలీఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పేరిట నెలకొల్పిన మెడికల్ కాలేజీని, హాస్పిటల్ ను సీఎం కేసీఆర్ ఉదయం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..కేంద్ర మంత్రుల‌పై కేసీఆర్ మ‌రోసారి మండిప‌డ్డారు. రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ఇవాళ తిట్టిపోతారు.. మ‌ళ్లీ ప్ర‌భుత్వ ప‌థ‌కాలు బాగున్నాయ‌ని రేపే అవార్డులు ఇస్తార‌ని కేసీఆర్ అన్నారు. ఇక్క‌డున్న విద్యార్థుల‌కు అన్ని విష‌యాలు తెలుసు.. ఈ న‌వీన స‌మాచార విప్ల‌వం ప్ర‌పంచ వ్యాప్తంగా విస్త‌రిస్తుంది. ప్ర‌తి ఒక్క‌రూ అద్భుత‌మైన జ్ఞానాన్ని స‌ముపార్జిస్తున్నారు. తెలంగాణ ప్ర‌జ‌ల అండ‌తో ఉద్య‌మం సాగించి, రాష్ట్రాన్ని సాధించామ‌న్నారు. అనేక రంగాల్లో తెలంగాణ నంబ‌ర్ వ‌న్‌గా ఉంద‌న్నారు. రాజ‌కీయాల కోసం కేంద్ర మంత్రులు కేసీఆర్‌ను, మంత్రుల‌ను తిట్టిపోతారు. ఇవాళ తిట్టిపోతారు.. రేపు అవార్డులు ఇస్తారని కేసీఆర్ తెలిపారు. ఉద్య‌మ స‌మ‌యంలో చెప్పిన‌వ‌న్నీ ఇవాళ సాకారం అయ్యాయి. తెలంగాణ జీఎస్‌డీపీ ఎక్కువ‌గా ఉంది. ప‌రిశుభ్ర‌త‌, ప‌చ్చ‌ద‌నంతో పాటు అనేక రంగాల్లో ముందంజ‌లో ఉన్నామని కేసీఆర్ అన్నారు.

Leave a Reply

Your email address will not be published.