సింగరేణి చిన్నారిని హత్యాచారం చేసిన కామాంధుడు ఆత్మహత్య

సింగరేణి చిన్నారిని హత్యాచారం చేసిన కామాంధుడు ఆత్మహత్య

ఆర్.బి.ఎం హైదరాబాద్: సైదాబాద్ సింగరేణి కాలనీలో చిన్నారిని హత్యాచారం చేసిన నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఘట్‌కేసర్-వరంగల్ మధ్య స్టేషన్ ఘన్‌పూర్ మండలం పామునూరు దగ్గర రాజారాం వంతెన రేల్వే ట్రాక్‌పై రాజు మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. మృతుడి చేతిపై మౌనిక అనే పచ్చబొట్టు ఉండడంతో రాజు మృతదేహంగా పోలీసులు గుర్తించారు. రాజు కుడి చేతిపై మౌనిక అని తెలుగులో, ఎడమచేతి మౌనిక అని ఇంగ్లీష్‌లో ఉంది. పచ్చబొట్టు ఆధారంతో హత్యాచార నిందితుడు రాజు అని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

ఈ నెల 9న సింగరేణి కాలనీలో చిన్నారిని రాజు అత్యాచారం చేసి ఆ తర్వాత హత్య చేశాడు. అనుమానంతో స్థానికుల సాయంతో చిన్నారి కుటుంబసభ్యులు రాజు ఉంటున్న గది వద్దకు వెళ్లగా.. గదికి తాళం వేసి ఉంది. దీంతో పోలీసులకు సమాచారమిచ్చారు. స్థానికులు గది తాళం పగలగొట్టేందుకు ప్రయత్నించగా పోలీసులు వద్దన్నారు. రాత్రి 12 గంటల దాకా వెతికి ఆ తర్వాత గది తాళం పగలగొట్టడంతో పాప మృతదేహం కనిపించింది. అప్పటి నుంచి రాజు పరారయ్యాడు. ఘటన జరిగినప్పటి నుంచి పోలీసులు రాజు కోసం గాలిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published.