పవన్‌కల్యాణ్‌ను ఢీ కొట్టిన నేతకు త్వరలో మంత్రి పదవి!

jagan

పవన్‌కల్యాణ్‌ను ఢీ కొట్టిన నేతకు త్వరలో మంత్రి పదవి!

ఆర్.బి.ఎం అమరావతి: ఆయన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ను ఢీ కొట్టారు. ఆ పోటీలో పవన్‌ను ఓడించారు కూడా. ఆయన ఎవరో కాదు.. పవన్‌కల్యాణ్‌ను ఓడించిన భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్‌. ఆయనకు ఎన్నికలకు ముందే సీఎం జగన్ మాట ఇచ్చారంట. భీమవరంలో పవన్‌తో తలపడేందుకు వైసీపీ నేతలు ఎవరూ ముందుకు రాలేందట. అయితే శ్రీనివాస్‌ను జగన్‌ బరిలోకి దింపారు. పోటీలోకి దింపేముందు ఆయనకు జగన్ ఓ హామీ ఇచ్చారంట. పవన్‌ను ఎన్నికల్లో ఓడిస్తే మంత్రి పదవి ఇస్తానని ప్రతినబూనారంట. ఎన్నికల్లో జగన్ వ్యూహం ఫలించింది. పవన్‌పై శ్రీనివాస్ గెలిచారు. వైసీపీ ప్రభుత్వం కొలువుతీరిన తర్వాత శ్రీనివాస్‌కు మంత్రి పదవి ఖాయమని అందరూ అనుకున్నారు. అయితే అంతకంటే ముందు మాట ఇచ్చిన వారనే జగన్ తన కేబినెట్‌లో చేర్చుకున్నారు.

అయితే ఆశావాహులను శాంతింపజేసేందుకు జగన్ అప్పుడు ఓ మాట ఇచ్చారు. రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉంటాయని చెప్పారు. రెండోసారి మంత్రివర్గ విస్తరణలో మిగిలిన వారికి చోటు కల్పిస్తానని భరోసా ఇచ్చారు. దీంతో మంత్రి పదవులు ఆశిస్తున్న ఎమ్మెల్యేలు జగన్ కంట్లో పడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. విపక్షాలపై విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో గ్రంధి శ్రీనివాస్ అటు ప్రతిపక్షాన్ని, ఇటు పవన్‌కల్యాణ్‌పై విమర్శలు సంధిస్తున్నారంట. పవన్‌కు శ్రీనివాస్ ధీటుగా సమాధానాలు ఇస్తున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఈ విషయాన్నే స్థానిక నేతలు సీఎం దృష్టికి తీసుకెళ్ళారట. జనసేనను ఎదుర్కోవాలంటే శ్రీనివాస్‌లో సాధ్యమని ఆ నేతలు జగన్ చెప్పారంట. అంతేకాదు శ్రీనివాస్‌కు మంత్రి పదవి ఇవ్వాలని సిఫారసు కూడా చేశారంట. దీంతో గ్రంథి శ్రీనివాస్‌కు మంత్రివర్గ విస్తరణలో బెర్త్ ఖాయమైందనే ప్రచారం జరుగుతోంది. ఆయనకు ఏ శాఖ కేటాయిస్తారన్న దానిపై క్లారిటీ రాలేదు.

Leave a Reply

Your email address will not be published.