విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి.

rayachoti mla sreekanthreddy ycp

విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి.

ఆర్.బి.ఎం: విజయవాడలోని కనక దుర్గమ్మ తల్లిని గురువారం చిత్తూరు ఎంఎల్ఏ ఆరణి శ్రీనివాసులు తో కలసి ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ వేదపండితులు, అధికారులు స్వాగతం పలికి వారి చేత పూజా కార్యక్రమాలు నిర్వహింపచేసి తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. వర్షాలు సంవృద్దిగా కురిసి రైతులు, ప్రజలు సుభిక్షంగా ఉండాలని, కరోనా మహమ్మారి త్వరితగతిన పూర్తిగా నశించాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో జీవించాలని శ్రీకాంత్ రెడ్డి ఆకాంక్షించారు. వైఎస్ఆర్ సిపి రాష్ట్ర కార్యదర్శి చిదంబర్ రెడ్డి,మాజీ జెడ్ పి టిసి నాగసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.