విద్యార్థుల పాలిట శాపంగా టీఆరెస్ ప్రభుత్వం: ఏనుగుల సందీప్ రెడ్డి, వైఎస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర విద్యార్థి విభాగం కోఆర్డినేటర్

విద్యార్థుల పాలిట శాపంగా టీఆరెస్ ప్రభుత్వం: ఏనుగుల సందీప్ రెడ్డి, వైఎస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర విద్యార్థి విభాగం కోఆర్డినేటర్

ఆర్.బి.ఎం : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పాలిట శాపంగా మారిందని వైఎస్సార్ తెలంగాణ  పార్టీ రాష్ట్ర విద్యార్థి విభాగం కోఆర్డినేటర్  ఏనుగుల సందీప్ రెడ్డి మండిపడ్డారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల తలపెట్టిన పాదయాత్రలో సందీప్ రెడ్డి పాల్గొన్నారు. విద్యార్థులు ఎదుర్కుంటున్న సమస్యలను షర్మిలకు సందీప్ రెడ్డి వివరించారు.

ఈ సందర్భంగా ఏనుగుల సందీప్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ షర్మిల తలపెట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్రకు ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందని అన్నారు. పాదయాత్ర మొదలైన రోజు నుండి ప్రజలు షర్మిలను ఆశీర్వదిస్తూ బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. వైఎస్సార్ అభిమానులు, ప్రజలు ఈ పాదయాత్ర లో భాగస్వాములు కావాలని ఈ పాదయాత్రను విజయవంతం చేయాలని ఏనుగుల సందీప్ రెడ్డి కోరారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశ అవినీతి పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గరికి వచ్చాయని ఈ సందర్భంగా ఏనుగుల సందీప్ రెడ్డి అన్నారు.

షర్మిలకు విద్యార్థుల సమస్యలు వివరిస్తూ ఏనుగుల సందీప్ రెడ్డి

ప్రజా ప్రస్థానం పాదయాత్రతో టిఆర్ఎస్ పతనం ప్రారంభమైందన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కచ్చితంగా తెలంగాణలో అధికారంలోకి వస్తుందని ఏనుగుల సందీప్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్న మార్పు ఈ యాత్రతో వస్తుందని ఏనుగుల సందీప్ రెడ్డి తెలిపారు. ప్రజల్లో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్రను చేస్తున్నట్టు ఏనుగుల సందీప్ రెడ్డి పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published.