రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని సమస్యలు వైఎస్ షర్మిల దృష్టికి: ఏనుగులు సందీప్ రెడ్డి, వైఎస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర విద్యార్థి విభాగం కోఆర్డినేటర్

రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని సమస్యలు వైఎస్ షర్మిల దృష్టికి: ఏనుగులు సందీప్ రెడ్డి, వైఎస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర విద్యార్థి విభాగం కోఆర్డినేటర్

ఆర్.బి.ఎం రాజేంద్రనగర్: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర మూడవ రోజు విజయవంతంగా సాగింది. ఈ పాదయాత్రలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర విద్యార్థి విభాగం కోఆర్డినేటర్ ఏనుగుల సందీప్ రెడ్డి పాల్గొన్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని పలు సమస్యలను ఏనుగుల సందీప్ రెడ్డి వైఎస్ షర్మిల దృష్టికి తీసుకెళ్లారు.

ఈ సందర్భంగా ఏనుగుల సందీప్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాజేంద్రనగర్ నియోజకవర్గం సమస్యలకు కేంద్రంగా మారిందన్నారు. నగరానికి కూతవేటు దూరంలో ఉన్న రాజేంద్రనగర్ ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని ఏనుగుల సందీప్ రెడ్డి తెలిపారు. చిన్నపాటి వర్షాలకే రాజేంద్రనగర్ ప్రధాన రహదారులు నదులను తలపిస్తున్నాయని ఆయన అన్నారు.

రాజేంద్రనగర్ లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేక విద్యార్థులు వేరే ప్రాంతాలకు వెళ్లే క్రమంలో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఏనుగుల సందీప్ రెడ్డి పేర్కొన్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో భూ కబ్జాదారుల ఆగడాలకు అంతులేకుండా పోతుందన్నారు. రాజేంద్రనగర్ లో ప్రభుత్వ కార్యాలయాలకు స్వంత స్థలం కేటాయించకపోవడం సిగ్గుచేటన్నారు. ప్రైవేట్ భవనాల్లో ప్రభుత్వ కార్యాలయాలను నడపడం దేనికోసం అని ఏనుగుల సందీప్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

వైఎస్ షర్మిల ప్రతి గ్రామానికి వెళ్లి సమస్యలు తెలుసుకుంటున్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ ఆర్ తెలంగాణ పార్టీ అధికారంలోకి కచ్చితంగా వస్తుందన్నారు. రాజన్న రాజ్యంతోనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని ఈ సందర్భంగా వైఎస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర విద్యార్థి విభాగం కోఆర్డినేటర్ ఏనుగుల సందీప్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published.