సింగరేణి కాలనీ నిందితుడు మద్యం సేవిస్తూ మరో వ్యక్తితో..

సింగరేణి కాలనీ నిందితుడు మద్యం సేవిస్తూ మరో వ్యక్తితో..

ఆర్.బి.ఎం హైదరాబాద్: సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య చేసిన మానవమృగాన్ని పట్టుకునేందుకు పోలీసులు వేటాడుతున్నారు. ఈ కేసులో నిందితుడి రాజు కోసం 100 మంది పోలీసులు గాలిస్తున్నారు. ఘటన జరిగిన రోజు ఆ తర్వాత సైదాబాద్, ఎల్బీనగర్ పరిసర ప్రాంతాల్లోని సీసీ పుటేజీలను పోలీసులు పరిశీలించారు. మరో వ్యక్తితో కలిసి మాస్క్‌ లేకుండా దర్జాగా నడుచుకుంటూ వెళ్తున్నట్లు సీసీ పుటేజీలో పోలీసులు గుర్తించారు. ఘటన జరిగిన రోజు సాయంత్రం ఎల్బీనగర్‌లో మరో స్నేహితుడితో కలిసి రాజు మద్యం తాగినట్లు సీసీ కెమెరాలో కనిపించింది. రాజు స్నేహితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజు చేసిన ఘోరం తనకు తెలియదని పోలీసులకు తెలిపాడు. ఇద్దరం కలిసి మద్యం తాగామని, ఆ తర్వాత అతను ఎక్కడికి వెళ్లాడో తనకు తెలియదని పోలీసులకు చెప్పాడు. గతంలో నిందితుడు రాజుపై దొంగతనం కేసు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. రాజు కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published.