సంచలన వ్యాఖ్యలు చేసిన మల్లారెడ్డి… ఆరేళ్ల బాలికను హత్యచారం చేసిన నిందితుడిని ఎన్‌కౌంటర్ చేస్తాం..

సంచలన వ్యాఖ్యలు చేసిన .. ఆరేళ్ల బాలికను హత్యచారం చేసిన నిందితుడిని ఎన్‌కౌంటర్ చేస్తాం..

ఆర్.బి.ఎం హైదరాబాద్: మంత్రి మల్లారెడ్డి ఏం మాట్లాడినా.. ఏం చేసిన సంచలనమే. ఆయన మాటలతో చేష్టలతో మీడియాను ఆయన వైపు తిప్పుకోవడంలో ఆయనకు ఆయనే సాటి. సైదాబాద్ సింగరేణి కాలనీ ఆరేళ్ల బాలిక హత్యాచారం ఘటనపై మంత్రి మల్లారెడ్డి స్పందించారు. బాలిక హత్యచారం ఘటన తనను కలిసివేసిందని చెప్పారు. హత్యాచారం చేసిన కామాంధుడిని ఎన్‌కౌంటర్ చేస్తామని ప్రకటించారు. త్వరలో బాలిక కుటుంబాన్ని పరామర్శిస్తానని మల్లారెడ్డి తెలిపారు. గురువారం సాయంత్రం సైదాబాద్ సింగరేణి కాలనీలో రాజు అనే కామాందుడు ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన విషయం తెలిసిందే. ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య చేసిన మానవమృగాన్ని ఎన్‌కౌంటర్‌ చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

నిందితుడు రాజు కోసం 10 ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. నిందితుడి పట్టుకునేందుకు సీపీ అంజన్‌కుమార్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. నిందితుడు హైదరాబాద్‌లోనే ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. రాజు కోసం పార్క్‌లు బార్లులో గాలిస్తున్నారు.

హత్యాచారానికి గురైన బాలిక కేసును బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ సుమోటోగా విచారణకు స్వీకరించింది. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసింది. డీజీపీ, సీపీ, కలెక్టర్‌కు నోటీసులు జారీ చేసింది.

One Comment on “సంచలన వ్యాఖ్యలు చేసిన మల్లారెడ్డి… ఆరేళ్ల బాలికను హత్యచారం చేసిన నిందితుడిని ఎన్‌కౌంటర్ చేస్తాం..”

Leave a Reply

Your email address will not be published.