తెలంగాణ ఆర్టీసీ చార్జీల పెంపుకు రంగం సిద్ధం.. ప్రజలపై ఎంత భారమంటే…

తెలంగాణ ఆర్టీసీ చార్జీల పెంపుకు రంగం సిద్ధం.. ప్రజలపై ఎంత భారమంటే…

ఆర్.బి.ఎం హైదరాబాద్‌: తెలంగాణలో ఆర్టీసీ చార్జీలు పెంచాలని ఆ సంస్థ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. చార్జీల పెంపుపై ఇప్పటికే కసరత్తు చేశారు. చార్జీల పెంపుపై ఈ రోజు ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌ ఆధ్వర్యంలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో చార్జీలు పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. చార్జీల పెంపుపై సీఎం కేసీఆర్‌కు ప్రతిపాదనలు పంపారు. సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి ప్రతిపాదన రాగానే నిర్ణయం తీసుకుంటారు. ఆర్టీసీ చార్జీలు పెంచక తప్పదని బాజిరెడ్డి అన్నారు. డీజిల్ ధరలు భారీగా పెంచడం వల్లే ఆర్టీసీ తీవ్ర నష్టాల్లోకి వెళ్లిందని తెలిపారు. అందువల్ల తీవ్ర నష్టాల్లో ఉన్నందున చార్జీల పెంపు నిర్ణయం తీసుకున్నామని ప్రకటించారు. పల్లె వెలుగు బస్సులకు కిలోమీటర్‌కు 25 పైసలు పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులకు కిలోమీటర్‌కు 30 పైసలు, సిటీ, ఆర్డినరీ బస్సులకు కిలోమీటరకు 25 పైసలు పెంచనున్నారు. మెట్రో డీలక్స్‌ బస్సులకు కిలోమీటరుకు 30 పైసలు పెంచాలని ఆర్టీసీ యాజమాన్యం భావిస్తోంది.

Leave a Reply

Your email address will not be published.