కవిత ఫాంహౌజ్‌ వద్ద భారీ పోలీస్‌ బందోబస్తు

శంకర్‌పల్లి: నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌ ఇంటిపై టీఆర్‌ఎస్‌ శ్రేణుల దాడి నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం దొంతాన్‌పల్లి గ్రామ శివారులో గల ఎమ్మెల్సీ కవిత ఫాంహౌజ్‌ వద్ద శనివారం భారీ పోలీస్‌ బందోబస్తు నిర్వహించారు. ఎంపీ అర్వింద్‌, ఎమ్మెల్సీ కవిత మధ్య మాటల యుద్ధం, దాడులకు దారితీయడంతో హైదరాబాద్‌ నుంచి శంకర్‌పల్లికి వచ్చే ప్రధాన రహదారిలో ఫాంహౌజ్‌ ఉండడంతో పోలీసులు భారీగా పహారా నిర్వహించారు. కవితపై అర్వింద్ చేసిన వ్యాఖ్యలు.. ఆ తర్వాత అర్వింద్ ఇంటిపై టీఆర్‌ఎస్ కార్యకర్తల దాడి నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా యుద్దవాతావరణం నెలకొంది.

Leave a Reply

Your email address will not be published.