మంచిర్యాల జిల్లాలో 1వ ఓపెన్ సౌత్ ఇండియన్ కరాటే ఛాంపియన్షిప్ 2022 క్రీడలు..

మంచిర్యాల జిల్లాలో 1వ ఓపెన్ సౌత్ ఇండియన్ కరాటే ఛాంపియన్షిప్ 2022 క్రీడలు..

ఆర్.బి.ఎం: 1వ ఓపెన్ సౌత్ ఇండియన్ కరాటే ఛాంపియన్షిప్ 2022 క్రీడలు మంచిర్యాల జిల్లా నస్పూర్ మండల్లో ఎంఎం గార్డెన్ లో జెన్ శితోర్యు కరాటే స్కూల్ అఫ్ మాంచెరిల్ వారు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ మొత్తం 700 మంది క్రీడాకారులు, కరాటే ఇంస్ట్రుక్టర్స్ అండ్ రెఫ్రీ అధికారులు, ఈ కార్యక్రమానికి దక్షిణాది నుండి వివిధ రాష్ట్రాల నుండి హాజరైయ్యారు. అలాగే ఈ క్రీడా ప్రారంభోత్సవానికి మంచిర్యాల జిల్లా ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి సత్తయ్య , అంజనీపుత్ర రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ ఛైర్మెన్ అండ్ టోర్నమెంట్ ఛైర్మెన్ గుర్రాల శ్రీధర్ అలాగే టోర్నమెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆండ్ అంజనీపుత్ర రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ రవి గారు , ముఖ్య ఆతిధులు గా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడను ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి సత్తయ్య మాట్లాడుతూ తానూ కరాటే ఆడేవాడినని, అయితే ఆడినప్పుడు మాత్రం గెలుపొందలేదన్నారు పూర్తి ఫిట్నెసు కరాటే మంచి క్రీడ అని కొనియాడారు. జిల్లా లో ఈ క్రీడాభివృద్ధికి ప్రత్యేక ప్రోత్సాహం అందిస్తున్న జిల్లా కరాటే అసోసియేషన్ మరియు కరాటే ఇంస్ట్రుక్టర్స్ అండ్ రెఫ్రీ అధికారులు అభినందించారు జిల్లా లో ఈ క్రీడాభివృద్ధికి ప్రత్యేక ప్రోత్సాహం అందిస్తున్న అంజనీపుత్ర రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ ఛైర్మెన్ అండ్ టోర్నమెంట్ ఛైర్మెన్ గుర్రాల శ్రీధర్ని ఈ సందర్భంగా కొనియాడారు అంతే కాకుండా 5000 రూపాయలు చెక్ ను ఆర్గనైజర్స్ కి అందచేశారు, తరువాత టోర్నమెంట్ ఛైర్మెన్ గుర్రాల శ్రీధర్ మాట్లాడుతూ మార్షల్ ఆర్ట్స్ నేటి రోజుల్లో ప్రతి ఒక్కరికి అవసరమన్నారు. కరాటే ద్వారా శారీర పైభా గాలే కాకుండా అంతర్ భాగాల్లో అన్ని అవయవాలు సక్రమంగా పని చేస్తాయన్నారు. పోటీల్లో గెలుపోటములు పక్కన పెట్టి క్రీడా స్పూర్తితో ఆడినప్పుడే అనుకున్న లక్ష్యం నెరవేరు తుందన్నారు.

కరాటే క్రీడ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నానని తెలిపారు. అనంతరం పోటీల నిర్వాహకులకు న్యాయమూర్తి సత్తయ్య, టోర్నమెంట్ ఛైర్మెన్ గుర్రాల శ్రీధర్కి శాలువా, పూలమాలలతో సన్మానించి జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో జెన్ శితోర్యు కరాటే స్కూల్ సెన్సెప్ సడక్ బాషా, టోర్నమెంట్ చీఫ్ ఆర్గనైజర్ మాటూరి మహేశ్, సాధన గ్రీన్ కిడ్స్ ప్లే స్కూల్ కరెస్పాండంట్ పెంచాలా శ్రీధర్,టోర్నమెంట్ న్యాయనిర్ణేత ఆవుల రాజనర్సు, టోర్నమెంట్ ఆర్గనైజర్ పోచంపల్లి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.