లారీని ఢీ కొట్టిన మరో లారీ

లారీని ఢీ కొట్టిన మరో లారీ

ఆర్.బి.ఎం: పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ B-గేటు సమీపం రాజీవ్ రహదారిపై ఈ రోజు తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. వైజాగ్ నుండి చంద్రపూర్ వెళ్తున్న బొగ్గు లారీ రహదారిపై ఆగి ఉన్నబూడిద లారీని ఢీకొట్టడంతో లారీలో ఉన్న క్లీనర్ రాజేశ్వరరావుకు తీవ్ర గాయాలు కాగా ఇల్లెందుకు చెందిన డ్రైవర్ నూతి వెంకట్ కు స్వల్ప గాయాలయ్యాయి. 108 వాహనంలో బాధితులను ఆస్పత్రికి తరలించారు. పక్కనే ఉన్న ట్రాఫిక్ పోలీస్ లకి సమాచారం అందగా వెంటనే వచ్చి రాజీవ్ రహదారి రోడ్ ఫై ఉన్న రెండు లారీ లని జేసీబీ మరియు ఫైర్ డిపార్ట్మెంట్ సహాయం తో అక్కడినుండి తొలిగించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తామని ఎన్టీపిసి పోలీస్ లు తెలియజేసారు .ఈ సందర్బంగా ట్రాఫిక్ SI నాగరాజు మాట్లాడుతూ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ముక్యంగా రోడ్ ఫై లైటింగ్ లేనందున ఆగిఉన్న లారీ కనపడకపోవడం ఎదురుగ లారీ ఓవర్ స్పీడ్ లో ఉండి స్పీడ్ కంట్రోల్ కాకపోవడం వలన ఈ సంఘటన జరిగింది అని తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published.