ప్రజలను చల్లగా చూడు మల్లన్న స్వామి: పుష్ప నాగేష్, రామచంద్రపురం కార్పొరేటర్

ప్రజలను చల్లగా చూడు మల్లన్న స్వామి: పుష్ప నాగేష్, రామచంద్రపురం కార్పొరేటర్

ఆర్.బి.ఎం డెస్క్: నవాబుపేట్ మండల పరిధిలోని పులుమామిడి గ్రామంలో మల్లన్న స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి దీవెనలను అందుకున్నారు. ఈ కార్యక్రమానికి రామచంద్రపురం కార్పొరేటర్ పుష్ప నాగేష్ ముఖ్య అతిథిగా హాజరై స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు.

ఈ సందర్భంగా రామచంద్రపురం కార్పొరేటర్ పుష్ప నాగేష్ మీడియాతో మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన జిల్లా కురుమ సంఘం వైస్ ప్రెసిడెంట్ రాఘవేందర్ యాదవ్ గారికి ధన్యవాదాలు. మల్లన్న స్వామి ఆశీస్సులు అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని, సకాలంలో వర్షాలు కురిసి రైతన్నలను కాపాడాలని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని విద్యార్థులు బాగా చదివి ఉన్నతమైన స్థాయికి చేరుకోవాలని ఆయన స్వామివారిని కోరానని చెప్పుకొచ్చారు. కురుమ సంఘం అభివృద్ధి కోసం ఎల్లవేళలా కష్టపడతానని ఎవరికి ఏ కష్టం వచ్చినా దాని నెరవేర్చడానికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. కురుమ సంఘం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుంది మరింత అభివృద్ధి చెందాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.