అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు: బిజెవైఎం నాయకులు, నవాబుపేట్
ఆర్.బి.ఎం డెస్క్: రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ కరీంనగర్ లోని తన నివాసంలో శాంతియుతంగా నిరసన చేస్తుంటే పోలీసులు అరెస్టు చేయడం సిగ్గుచేటు అని బిజెవైఎం నాయకులు మండిపడ్డారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అక్రమ అరెస్టును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల, జిల్లా కేంద్రాలలో నిరసన ప్రదర్శనలకు తెలంగాణ బీజేపీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో నవాబుపెట్లో బిజెవైఎం నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు.
బిజెవైఎం ప్రెసిడెంట్ వడ్డే హనుమంతు, వైస్ ప్రెసిడెంట్ సుదర్శన్ బిజెపి జనరల్ సెక్రెటరీ శ్రీనివాస్ రెడ్డిలు పోలీసులు అరెస్టు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంపై లీకేజీ ప్యాకేజీ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళుతుండటంతోనే దాన్ని పక్కదారి పట్టించడానికి బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్‌ను అరెస్ట్ చేసి ఇప్పుడు కారణాలు వెతుకుతున్నారని వారు మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెబుతూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు సంజయ్‌ను బేషరత్‌గా విడుదల చేయాలని బిజెవైఎం నాయకులు డిమాండ్ చేశారు.