దొండకాయ తింటే పురుషులకు ఏమౌతుందో తెలుసా?

దొండకాయ తింటే పురుషులకు ఏమౌతుందో తెలుసా?

ఆర్.బి.ఎం డెస్క్: పొరుగింటి పుల్లకారు చాలా రుచిగా ఉంటుందని అందరి భావన. మనింట్లో చేసుకునే వంటలకంటే పక్కింట్లో వండే వంటలనే ఎక్కువగా ఇష్టపడుతుంటారు. మరి కొందరిలో ఇంటి వంటలపై ఆసక్తి చూపరు. అలాగే మన పెరట్లో పండే కారగాయలంటే కూడా చాలా మంది చిన్న చూపుచూస్తారు. కానీ మన పెరట్లో పండే కూరగాయలు తింటే అనేక ప్రయోజనాలు పొందుతాము. మన పెరట్లో పండే దొండకాయ వల్ల అనేక ఉపయోగాలున్నాయి. దొండకాయను అనేక రకాలుగా వండుకోవచ్చు. దొండకాయ వల్ల ఎటువంటి హాని ఉండదు. దొండకాయలో లైంగిక శక్తిని పెంచే గుణాలున్నాయని పాకశాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

దొండకాయ చాలా రుచిగా ఉంటుంది. మన శీరానికి చలవనిస్తుంది. రక్తస్రావం అయ్యే జబ్బుల్లో తప్పనిసరిగా దొండకాయను క్రమం తప్పకుండా తీసుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చు. పురుషుల్లో లైంగిక శక్తిని పెంచుతుంది. దొండకాయకు జిడ్డును తొలగించే గుణం కూడా ఉంది. రక్త నాళాల్లో కొవ్వు పెరగకుండా అదుపులో పెడుతుంది. దీర్ఘకాలిక రోగాలు బీపీ, షుగర్ వ్యాధులున్నవారు తింటే మంచి ఫలితాలు ఆశించవచ్చు. కడుపులో ఉబ్బరాన్ని కూడా తగ్గిస్తుంది. విరేచనాలను కూడా కంట్రోల్ చేసే లక్షణం దొండకాయకే సొంతం. దొండకాయల్లో పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. బీటా కెరోటిన్, విటమిన్‌–బి1, బి2, బి3, బి6, విటమిన్‌–సి వంటివి కూడా ఉంటాయి. మెగ్నీషియం, ఐరన్, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం, జింక్‌ వంటి లవణాలు దొండకాయలో పుష్కలంగా ఉంటాయి.

Leave a Reply

Your email address will not be published.