వాముతో ఎన్ని ఉపయోగాలో తెలుసా.. వాము వాడండి ఆరోగ్యంగా ఉండండి..!

ఆహారపు అలవాట్లతో పాటు మారుతున్న పరిస్థితుల కారణంగా చాలామంది అజీర్తి, గ్యాస్ సమస్యలతో పాటు బాధపడుతున్నారు. ఈ రెండు సమస్యలతో బాధపడుతున్న వారిలో పెద్దలతో పాటు పిల్లలూ ఉన్నారు. పెద్దల్లో అయితే పని ఒత్తిడి కారణంగా సమయానికి ఆహారం తీసుకోకపోవడం.. అలాగే ఇన్‌స్టట్ ఆహారాన్ని తీసుకోవడం వల్ల గ్యాస్, అజీర్తి సమస్యలతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. జంక్‌ఫుడ్స్‌, ఫాస్ట్‌ఫుడ్స్‌ లాంటి ఆహారపు అలవాట్లు వల్ల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఇన్‌స్టట్ ఆహార పదార్థాలు తరచూ తీసుకోవడం వల్ల జీర్ణాశయానికి సంబంధించిన గ్యాస్‌, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం తదితర సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఈ రెండు సమస్యల నుంచి ఉపశమనం పొందటానికి ఇంగ్లిష్‌ మందులు వాడుతున్నారు. అల్లోపతి వల్ల ఇతర సమస్యలు వచ్చే అవకావం ఉంది. అయినా ఎక్కువగా ఇంగ్లిష్ మందులు వాడేందుకే మొగ్గు చూపుతుంటారు.

ఈ మందులకు బదులుగా మనం ఇంట్లో సులువుగా కొన్ని చిట్కాలను ఉపయోగించి అజీర్తి ఇంకా గ్యాస్‌ ఇబ్బందుల నుంచి బయటపడొచ్చు. అజీర్తి, గ్యాస్ సమస్యలకు వాము సంజీవినిలా పనిచేస్తుంది. ఈ సమస్యలకు వాము చక్కని పరిష్కారం. వాము వలన జీర్ణాశయానికి చాలా ఉపయోగాలున్నాయి. అజీర్తి, కడుపు ఉబ్బరం, గ్యాస్‌ మొదలైన సమస్యలను దూరం చేస్తుంది. జీర్ణక్రియలో ఇబ్బందులను తొలగించి జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. కడుపునొప్పిని తగ్గిస్తుంది. వామును నిమ్మరంతో కలపి తీసుకుంటే హైడ్రోక్లోరిన్‌ యాసిడ్‌ పునరుద్ధరించబడుతుంది. ఆ ప్రక్రియ వల్ల ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. ఆహారం జీర్ణమయితే అజీర్తి, గ్యాస్ సమస్యల వంటి సమస్యలుండవు.

Leave a Reply

Your email address will not be published.