ఇతర ప్రాంతాల నుండి వచ్చి పులిమామిడిలో పేకాట..

ఇతర ప్రాంతాల నుండి వచ్చి పులిమామిడిలో పేకాట..

ఆర్.బి.ఎం పులిమామిడి: పేకాటకు బానిసలుగా మారి ఎంతో మంది కుటుంబాలు రోడ్డున పడ్డ సంఘటనలు ఎన్నో నెలకొన్నాయి. కాగా నవాబుపేట్ మండల్ పులిమామిడి గ్రామంలో పేకాట స్థావరాలును పలువురు ఏర్పాటు చేసుకొని యధేచ్చగా ఆడుతున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

పులిమామిడి గ్రామంలో పేకాట ఆడటానికి శంకర్ పల్లి,సంగారెడ్డి,వికారాబాద్ నుండి వస్తున్నారని ఇంత జరుగుతున్నా పులిమామిడి గ్రామానికి కూతవేటు దూరంలో ఉన్న నవాబుపేట్ పోలీసులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని పలువురు స్థానిక గ్రామస్థులు మండిపడ్డారు.

పులిమామిడిలో పేకాట ఆడటానికి ఇతర ప్రాంతాల నుండే వచ్చే వారికి గ్రామానికి చెందిన కొందరు వారికి ఆశ్రయం కల్పిస్తున్నారని గ్రామస్థుల సమాచారం. పులిమామిడిలో రోజుకు లక్షల్లో పేకాట ఆడుతున్నారని అన్నారు. పేకాట ఆడుకోవడానికి వసతులు కల్పించినందుకు పేకాట రాయుళ్ల వద్ద నుండి కొందరు గ్రామస్థులు వసూళ్లకు పాల్పడుతూ సొమ్ముచేసుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో పులిమామిడి గ్రామ ప్రజలు ఆర్.బి.ఎం మీడియాతో మాట్లాడుతూ గ్రామంలో ఉన్న పేకాట స్థావరాలపై పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రామంలో ఉన్న యువత పేకాట జోలికి వేళ్ళకుండ చూడాలని , ఇతర ప్రాంతాల నుండి గ్రామానికి పేకాట ఆడటానికి వచ్చే వారికి వసతులు కల్పించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published.