మత్స్య సంపద మరింత పెరిగి గంగపుత్రులకు ఏడాదిపొడవునా ఉపాధి: మెతుకు ఆనంద్, వికారాబాద్ ఎమ్మెల్యే

మత్స్య సంపద మరింత పెరిగి గంగపుత్రులకు ఏడాదిపొడవునా ఉపాధి: మెతుకు ఆనంద్, వికారాబాద్ ఎమ్మెల్యే

ఆర్.బి.ఎం వికారాబాద్: వికారాబాద్ మండల పరిధిలోని సర్పన్ పల్లి చెరువులో వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ కట్ల 92,400, రోహు 1,15,500, మ్రిగాల 23,100, మొత్తం 2,31,000 (రెండు లక్షల ముప్పై ఒక్క వెయ్యి) చేపపిల్లలు వదిలారు. స్వరాష్ట్ర స్వపరిపాలనలో సకలజనుల సంక్షేమం విరజిల్లుతుందని అయన అన్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామీణ వృత్తుల అభివృద్ధిలో భాగంగా పక్కా ప్రణాళికతో చెరువులను మిషన్‌ కాకతీయ ద్వారా అభివృద్ధి చేసి వాటి ఫలాలు ప్రజలకు అందేలా కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్నారు. కేసీఆర్ తెచ్చిన నీలివిప్లవం మూలంగా నేడు రాష్టంలో అనేక చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు చేపలతో కళకళలాడుతూ గంగపుత్రుల జీవితాలలో వెలుగులు నింపారని ఎమ్మెల్యే తెలిపారు. మత్స్య సంపద మరింత పెరిగి గంగపుత్రులకు ఏడాదిపొడవునా ఉపాధి లభిస్తుందన్నారు. మత్స్యకారుల సంక్షేమానికి అన్ని రకాలుగా ప్రభుత్వం కృషి చేస్తుందని ఈ సందర్బంగా వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.