మునుగోడులో దూకుడు పెంచిన బీజేపీ

మునుగోడు: ఉప ఎన్నికలో బీజేపీ దూకుడు పెంచింది. మునుగోడులో కాషాయజెండా ఎగురవేయాలని బీజేపీ యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుంటోంది. నవంబర్‌లో మునుగోడు ఉప ఎన్నిక నిర్వహించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఈ నెల 7న మునుగోడు ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చే అవకాశముందని బీజేపీ నేతలు చెబుతున్నారు. దసరా తర్వాత నుంచి మునుగోడుపై దండయాత్రకు కమలనాథులు సిద్ధమవుతున్నారు. 7వ తేదీ నుంచి మునుగోడుపై పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి‌ సంజయ్ నిర్ణయం తీసుకున్నారు.‌ ప్రస్తుతం ఆయన భవానీ దీక్షలో ఉన్నారు. ఈ దీక్ష దసరాతో ముగుస్తుంది. ఆ తర్వాత పూర్తిస్థాయిలో మునుగోడుపై దృష్టి సారిస్తారని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే ప్రతి ఇంటిని టచ్ చేసేలా ప్రచారానికి ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. ఈనెల 7వ తేదీ నుంచి మునుగోడులో అన్ని గ్రామాల్లో బీజేపీ బైక్ యాత్రలు నిర్వహించనున్నారు. 189 గ్రామాల్లో బైక్ యాత్రకు ప్లాన్ రెడీ చేశారు. 10వ తేదీన బూత్ కమిటీ సభ్యులతో బండి సంజయ్ సమావేశమవుతారు. ఉప ఎన్నికలో నకిలీ ఓట్ల పడే అవకాశం ఉందని బీజేపీ నేతలు పసిగట్టారు. అందుకే నకిలీ ఓట్లపై దృష్టి సారించారు. ఓటర్ లిస్టును వెరిఫికేషన్ చేయాలని కమలనాధులు నిర్ణయించారు.

Leave a Reply

Your email address will not be published.