బెంగళూరు: చెల్లెలును ప్రేమిస్తున్నాడనే కోపంలో స్నేహితుడినే దారుణంగా హత్య చేశాడు. చిక్కబళ్ళాపుర తాలూకా హారోబండ గ్రామంలో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. అయితే ఈ హత్యకు సంబంధించిన వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. నందన్, దర్శన్ స్నేహితులు. నందన్ చిక్క బళ్ళాపురలో అద్దె ఇంట్లో ఉండేవాడు. స్నేహితులు కాబట్టి దర్శన్ ఇంటికి నందన్ వెళ్లేవాడు. ఈ క్రమంలో దర్శన్ చెల్లెలను నందన్ ప్రేమించేవాడు. స్నేహితుడు నందన్‌ను పలుమార్లు హెచ్చరించాడు. అయినా అతనిలో మార్పు రాకపోవడంతో హత్య చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. దర్శన్, ఆశ్రయ్ అనే మిత్రుడితో కలసి నందన్‌ను విందుకు పిలిచాడు. పథకం ప్రకారం నందన్‌కు ఎక్కువగా మద్యం తాగించారు. ఆ తర్వాత మారణాయుధాలతో 40సార్లకుపైగా శరీరంపై ఇష్టారాజ్యంగా పొడిచి హత్య చేశాడు. పోలీసులకు విషయం తెలియడంతో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. హత్యకు కారకులైన దర్శన్, ఆశ్రయ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
చెల్లెలిని ప్రేమించాడని.. స్నేహితుడిని 40సార్లు పొడిచిపోడిచి చంపాడు
