హైదరాబాద్: రాష్ట్రంలో ఉత్కంఠ రేపుతున్న ఎలక్షన్..మునుగోడు బై పోల్. దీనికి సబంధించిన తేదీని సోమవారం ఎన్నికల సంఘం ప్రకటించింది. నవంబర్ 3న ఉప ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌లో తెలిపింది. ఈ నెల 7న ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానున్నది. అదే రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమై.. ఈ నెల 14తో నామినేషన్ల గడువు ముగియనున్నది. నవంబర్ 3న ఎన్నికలకు పోలింగ్ జరుగనుండగా.. 6న ఓట్లను లెక్కించనున్నారు.