హతవిధి.. ఇలా అయిందేమీ చంద్రబాబు..!

అమరావతి: టీడీపీ ట్విట్టర్ ఖాతా రెండోసారి హ్యాక్‌కు గురయింది. టెక్నాలజీని అవపోశన పట్టానని చెప్పే చంద్రబాబు టీడీపీ టిట్టర్ ఖాతా హ్యాకింగ్ కాకుండా కాపాడుకోలేకపోతున్నారు. గతంలో ఓ సారి హ్యాక్‌కు గురయితే వైసీపీ నేతల పనేనంటూ ఆరోపించారు. అప్పుడు ట్విట్టర్ ఖాతాలో అసభ్యపదజాలాలతో పోస్టింగులు పెట్టారు. దానివల్ల హ్యాక్‌కు గురయింది. టీడీపీ ట్విట్టర్ అకౌంట్ ను హ్యాక్ చేసిన వారు టీడీపీ పోస్టులకు బదులుగా ఇతర పోస్టులు పెడుతున్నారు. అలాగే డిస్క్రిప్షన్ ను మార్చేశారు. దీంతో రెగ్యులర్ గా టీడీపీ ఖాతాను పాలో అయ్యే వారు ఒక్కసారిగా అవాక్కయ్యారు. కానీ ఈ సారి అటువంటిదేమీ లేకపోయినా హ్యాక్ అయింది. ఈ సారి కూడా వైసీపీ నేతల పనేనని ఆడిపోసుకున్నారు. మొదటిసారి హ్యాక్‌‌కు గురయినా టీడీపీ జాగ్రత్త పడలేదు. రెండోసారి కూడా హ్యాక్ గురికావడం టీడీపీ సోషల్ మీడియా విభాగం డొల్లతనం బయటపడింది. అతి తక్కువ సెక్యూరిటీతో ట్విట్టర్ ఖాతాను నడుపుతున్నారనే విమర్శులున్నాయి.

ఓసారి మోదీ ఖాతాను హ్యాక్ చేసి రాత్రికి రాత్రి క్రిప్టో కరెన్సీలకు అనుమతులిస్తున్నట్లుగా ప్రకటించారు. ప్రధాని ఖాతానే హ్యాక్ చేయగలిగినప్పుడు టీడీపీ ఖాతా ఎంత అనుమానం రావొచ్చు. సెక్యూరిటీ ఫీచర్స్ గట్టిగా పెట్టుకుంటే ట్విట్టర్ ఖాతాలు హ్యాక్‌కు గురికాకుండా జాగ్రత్త పడొచ్చని నిపుణులు చెబుతున్నారు. టీడీపీ ట్విట్టర్ ఖాతా హ్యాక్‌కు గురికావడంతో అది సోషల్ మీడియా విభాగం వైఫల్యమేనని విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా టీడీపీ సోషల్ మీడియా విభాగం జాగ్రత్తపడాల్సిన అవసరముందని సూచిస్తున్నారు. పెగాసస్‌తో పాటు దానికి వంద రెట్లు సామర్థ్యమున్న నిఘా వ్యవస్థలను అన్ని రాజకీయ పార్టీలు వినియోగిస్తున్నాయి. ఈ నిఘా వ్యవస్థలతో ప్రత్యర్థుల హ్యాక్ చేయడం ఏమంత కష్టమైన పనికాదని అంటున్నారు. అయితే వాటి రక్షణకు కూడా అదే స్థాయిలో రాజకీయ పార్టీలు గట్టి చర్యలు తీసుకోవాలని చెబుతున్నారు. తాజా పరిస్థితులతో చంద్రబాబు మేల్కొంటే మంచిదని, లేకుంటే టీడీపీ రహస్యాలు ప్రత్యర్థులకు చేరే అవకాశముందని హెచ్చరిస్తున్నారు.

 

Leave a Reply

Your email address will not be published.