కేసీఆర్ ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కవిత అసంతృప్తి
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కవిత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. శాసనమండలిలో ఆమె మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులకు కనీసం కూర్చోడానికి కూడా కుర్చీ లేదని సూటిగా ప్రశ్నించారు. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును ప్రశ్నించారు. రాష్ట్రంలో కొత్తగా మండలాలు ఏర్పాటైనా ఎంపీపీలకు తగిన కార్యాలయాలు లేవని, రోజువారీ అధికారిక విధుల నిర్వహణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీరాజ్ మంత్రి చొరవ తీసుకుని దీనికి పరిష్కారం చూపాలని కవిత డిమాండ్ చేశారు.