భారత్ బంద్ కార్యక్రమంలో పాల్గొన్న టీపీసీసీ అధికార ప్రతినిధి ఓదెల జడ్పీటీసీ గంట రాములు యాదవ్..

భారత్ బంద్ కార్యక్రమంలో పాల్గొన్న టీపీసీసీ అధికార ప్రతినిధి ఓదెల జడ్పీటీసీ గంట రాములు యాదవ్..

ఆర్.బి.ఎం: ఈరోజు కేంద్ర,రాష్ట్ర ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసనగా పెద్దపల్లి నియోజకవర్గంలోని కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలో అఖిల పక్షం ఆధ్వర్యంలో ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ మరియు రాహుల్ గాంధీ పిలుపు మేరకు భారత్ బంద్ కార్యక్రమంలో పాల్గొన్న టీపీసీసీ అధికార ప్రతినిధి ఓదెల జడ్పీటీసీ గంట రాములు యాదవ్. ధర్నాలో పాల్గొని కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు నల్ల చట్టాలు రద్దు చేయాలని కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలో వ్యాపార సంస్థలు, పెట్రో బంకులు, బ్యాంకులు,రవాణా సంస్థలు బంద్ చేయించారు.

ఈ సందర్భంగా గంట రాములు యాదవ్ మాట్లాడుతూ దేశంలో మోడీ రాష్ట్రంలో కేసీఆర్ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి ప్రజలపై భారం మోపుతున్నారని ధరలు తగ్గించమంటే ఒకరి మీద ఒకరు తప్పులు చెప్పుకొని తప్పించుకుంటున్నారని రాములు యాదవ్ మండిపడ్డారు. నిత్యావసరాల వస్తువుల మీద అధిక ధరలు పెంచి ఈ కేంద్ర ప్రభుత్వం సామాన్యుడి నడ్డి విరుస్తుందని ఒక మధ్య తరగతి వ్యక్తి ఇప్పుడు ఉన్న పరిస్థితులలో బ్రతకడానికి వీలు లేకుండా చేస్తున్నారని రాములు యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటుచేసిన ప్రభుత్వ రంగ సంస్థలను నరేంద్ర మోడీ ప్రైవేటీకరణ చేయడం ఇది నిరంకుశ పాలనకు నిదర్శమని ఆయన ఏద్దేవా చేశారు. నల్ల చట్టాలను వెంటనే కేంద్ర ప్రభుత్వం విరమించుకొని అన్నం పెట్టే అన్నదాత లను ఆదుకోవాలని ఈ దేశానికి రైతే వెన్నుముక అనే ఈ విషయాన్ని మర్చిపోవద్దని టీపీసీసీ అధికార ప్రతినిధి ఓదెల జడ్పీటీసీ గంట రాములు యాదవ్ తెలిపారు

Leave a Reply

Your email address will not be published.