ప్రతిఒక్కరూ మహాత్ముడిని ఆదర్శంగా తీసుకోవాలి: లాల్ కృష్ణ ప్రసాద్

పరిగి:    మహాత్మాగాంధీ  జయంతిని దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే పరిగి పట్టణంలో  గాంధీ జయంతి ఉత్సవాలు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ యం. లాల్ కృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పరిగి పట్టణంలోని గాంధీ విగ్రహానికి  పూలమాల    వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా లాల్ కృష్ణ మాట్లాడుతూ అహింస ఆయుధంగా బ్రిటీష్‌ వారిని ఎదిరించి, శాంతియుతంగా పోరాడి దేశానికి స్వాతంత్రం అందించి జాతిపితగా నిలిచారని కొనియాడారు. ప్రతిఒక్కరూ మహాత్ముడిని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగినప్పుడే దేశం సర్వోన్నతి చెందుతుందన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ చూపిన సత్యం, ధర్మం, అహింసా మార్గాలు ప్రతిఒక్కరూ అనుసరించాలని పిలుపునిచ్చారు. గాంధీ అడుగుజాడల్లో నేటి యువతరం నడవాలని కోరారు. బాపూజీకి స్వాతంత్య్రం రాకముందు ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి. అయినా వాటన్నింటనీ అధిగమించి ఆయన మహాశక్తిలా మారారని గుర్తుచేశారు. బ్రిటీష్ వారు మన దేశం నుండి వెళ్లిపోయేందుకు సహాయ నిరాకరణ ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం, స్వదేశీ వంటి ఉద్యమాలు ఎన్నో నడిపారని లాల్ కృష్ణ ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నేతలు పాల్గొని బాపూజీకి నివాళులు అర్పించారు.

Leave a Reply

Your email address will not be published.