కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకంతో బాల్య వివాహాలు తగ్గాయి: విక్రమ్ రెడ్డి, క్యాసారం ఉప్ప సర్పంచ్

kyasaram village medak patancheru mla gudem mahipal reddy

కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకంతో బాల్య వివాహాలు తగ్గాయి: విక్రమ్ రెడ్డి, క్యాసారం ఉప్ప సర్పంచ్

ఆర్.బి.ఎం పటాన్ చేరు, క్యాసారం: క్యాసారం గ్రామానికి చెందిన జొన్నాడ శారదా,కైల నిర్మలకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కల్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు.

ఈ సందర్భంగా క్యాసారం గ్రామ ఉప్ప సర్పంచ్ విక్రమ్ రెడ్డి ఆర్.బి.ఎం మీడియాతో మాట్లాడుతూ కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకంతో బాల్య వివాహాలు తగ్గాయని అన్నారు. పార్టీలకతీతంగా పైసా లంచం ఇవ్వకుండా నిరుపేదలైన ఎంతో మంది ఈ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నారని విక్రమ్ రెడ్డి పేర్కొన్నారు. మహిళా సాధికారతే లక్ష్యంగా ప్రతి పథకంలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పెన్షన్ లను మహిళలకు ప్రభుత్వం అందిస్తుందని విక్రమ్ రెడ్డి అన్నారు. బంగారు తెలంగాణ ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని విక్రమ్ రెడ్డి తెలిపారు. లాక్ డౌన్ వల్ల ఆర్థిక మాంద్యం ఉన్నప్పటికీ పేదవారికి అందే సంక్షేమ పథకాలు మాత్రం ఎక్కడ ఆగకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ పకడ్బందీగా అమలు చేస్తున్నారని విక్రమ్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మహిళలంతా ముఖ్యమంత్రి కేసీఆర్ ని నిండు నూరేళ్లు బతకాలని దీవించాలని విక్రమ్ రెడ్డి కోరారు.ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి సుప్రజ వెంకట్ రెడ్డి, ఎంపిపి సుష్మ వేణుగోపాల్ రెడ్డి, గడీల కుమార్ గౌడ్, ఎంపిటిసి రమేష్, క్యాసారం గ్రామ వార్డు సభ్యులు మీటే ఈశ్వర్ యాదవ్, తెరాస నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.