శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో రెండో రోజూ రాయచోటిలో సాగిన వైయస్ఆర్‌సీపీ జనాగ్రహ దీక్షలు

శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో రెండో రోజూ రాయచోటిలో సాగిన వైయస్ఆర్‌సీపీ జనాగ్రహ దీక్షలు

ఆర్.బి.ఎం రాయచోటి: రాయచోటి పట్టణంలో వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపుమేరకు చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో రెండో రోజు జనాగ్రహ దీక్షలు జరిగాయి. ప‌ట్ట‌ణంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుటనిర‌స‌న కార్య‌క్ర‌మం చేప‌ట్టారు.ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పై టి డి పి నేత పట్టాభి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు క్షమాపణలు చెప్పాలని వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్దఎత్తున డిమాండ్ చేశారు. జెడ్ పి మాజీ వైస్ చైర్మన్ దేవనాథరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో భావోద్వేగాలును రెచ్చగేట్టేందుకు తెలుగుదేశం కుట్ర పన్నుతోందన్నారు. ఎన్నికల ఫలితాలతో టిడిపికి పుట్టగతులు ఉండవని తెలుసుకున్న చంద్రబాబు, లోకేష్ లు ఏదో రకమైన కుట్ర రాజకీయాలు చేసి, శాంతి భద్రతలకు భంగం కలిగించి రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు చేసే దీక్షలన్ని దొంగదీక్షలని దుయ్యబట్టారు. మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాష మాట్లాడుతూ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ కు వస్తున్న ప్రజాదరణను చూసి ఒర్వేలేక..ఉనికి కోసమే తెలుగుదేశం పార్టీ నేతలు ఆరాటపడు తున్నారన్నారు.కుట్రలకు ఆద్యుడు చంద్రబాబునేనని తెలిపారు.

చంద్రబాబు అండ్ కో చేస్తున్న తప్పులను ప్రజలెవ్వరూ ఇకఉపేక్షించరన్నారు. చంద్రబాబు ప్లాన్‌ ప్రకారమే పట్టాభి అనుచిత వ్యాఖ్యలు చేశారని,ఆ వ్యాఖ్యలను రాష్ట్ర ప్రజలు సహించలేదన్నారు.మున్సిపల్ వైస్ చైర్మన్ ఫయాజర్ రెహమాన్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వయసుకు తగ్గ ఆలోచనలు చేయడం లేదని మండిపడ్డారు. ప్రతిపక్ష నాయకులకు మతి భ్రమించిందన్నారు. లక్కిరెడ్డిపల్లె మండల పరిషత్ అధ్యక్షుడు మద్దిరేవుల సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో గొడవలు సృష్టించాలన్నాదే తెలుగుదేశం పార్టీ లక్ష్యం వున్నట్లుగా కన్పిస్తోందన్నారు. తెలుగుదేశం పార్టీని బతికించుకోవడానికి చంద్రబాబు దీక్ష చేసాడన్నారు.ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ బేపారి మహమ్మద్ ఖాన్ మాట్లాడుతూ ఏపీ ప్రజలు చంద్రబాబుని తిరస్కరించారన్నారు. టిడిపికి ఇక భవిష్యత్తు లేదన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ చెన్నూరు అన్వర్ బాషా మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ పై అనుచిత వ్యాఖ్యలు ఇది పక్కా టి డి పి కుట్ర అని తెలిపారు. చంద్రబాబు డైరెక్షన్‌లోనే పట్టాభి బూతులు మాట్లాడారన్నారు.మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ విజయభాస్కర్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ దూషణలుపై రాష్ట్రమంతటా జనాగ్రహం వెలువెత్తిందన్నారు. చంద్రబాబు దీక్ష అంటేనే ఒక దొంగ దీక్ష అని అన్నారు. చంద్రబాబు ఒక ఉగ్రవాదిలా ప్రవర్తిస్తున్నారనిమండిపడ్డారు.మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కొలిమి హారూన్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నీచరాజకీయాలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. చంద్రబాబు ఆటలు ఇక సాగవన్నారు.

ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి నాయకులు అలీనవాజ్ ఖాన్, ఆసీఫ్ అలీఖాన్, కొలిమి ఛాన్ బాషా, జాకీర్, ఫయాజ్ అహమ్మద్,కసిరెడ్డి వెంకట నరసింహారెడ్డి,దిన్నెపాడు రవిరాజు, సుగవాసి శ్యామ్, గౌస్ ఖాన్, హసన్ బాషా, సుగవాసి ఈశ్వర్ ప్రసాద్, జయన్న నాయక్,పల్లా రమేష్, అన్న సలీం,అల్తాఫ్, షబ్బీర్, జానం రవీంద్ర యాదవ్, రియాజ్,ఆనంద రెడ్డి, కూరగాయల మహబూబ్ బాష, రియాజుర్ రెహమాన్, గువ్వల బుజ్జిబాబు,కోతపల్లె ఇంతియాజ్, నిస్సార్,మహేష్, జాఫర్ అలీఖాన్,కో అప్షన్ సభ్యులు అయ్యవారు రెడ్డి, ఆసీఫ్ అలీఖాన్, ఖాదర్ వలీ, అమీర్, మోక్షిత్, విక్కీ దేవేంద్ర, జావీద్, కొత్తిమీర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.