JNTU వద్ద ఉద్రిక్తత.. విద్యార్థులపై లాఠీ ఛార్జ్…

JNTU వద్ద ఉద్రిక్తత.. విద్యార్థులపై లాఠీ ఛార్జ్…

హైదరాబాద్: జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ విశ్వవిద్యాలయం ముందు ఉద్రిక్తత నెలకొంది. COVID-19 సంక్షోభ సమయంలో పరీక్షలు నిర్వహించడంపై విద్యార్థులు నిరసన వ్యక్తం చేసారు. మొదటి సంవత్సరం నుండి మూడవ సంవత్సరం విద్యార్థులకు ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండా పై తరగతులకు ప్రమోట్ చేయాలని NSUI కార్యకర్తలు విద్యార్థి నాయకులు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తూ JNTU లోకి ప్రవేశించడానికి ప్రయత్నిచారు. విద్యార్థులు అంత ఒకేసారి ప్రాంగణంలోకి ప్రవేశించడంతో జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ విశ్వవిద్యాలయం సిబ్బంది కాలేజీ ద్వారాలను మూసివేశారు. అయితే, కొంతమంది విద్యార్థులు గేట్ల పైకి ఎక్కి వర్సిటీలోకి ప్రవేశించారు. ఐఐటి, ఎన్‌ఐటి పరీక్షలను రద్దు చేసి విద్యార్థులను పదోన్నతి కల్పించాయని, జెఎన్‌టియుహెచ్ పరిపాలనను కూడా అనుసరించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో పరిస్థితి చేయిజారడంతో JNTU సిబ్బంది పోలీసులకు సమాచారం అందిచారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై లాఠీ ఛార్జ్ చేసి అరెస్టు చేశారు.

Leave a Reply

Your email address will not be published.