నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల టీజేఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కోదండరాం..
హైదరాబాద్: రానున్న పట్టభద్రుల ఎన్నికల్లో ప్రొఫెసర్ కోదండరాం పోటీ చేయనున్నారని టీజేఎస్ ఉపాధ్యక్షుడు విశ్వేశ్వరరావు అధికారికంగా ప్రకటించారు. ప్రశ్నించే గొంతు కోసమే ప్రజలు ఎదురు చూస్తున్నారు అని అయన వెల్లడించారు. అందువల్లనే ఈ పట్టభద్రుల ఎన్నికల్లో పోటీ చేయనున్నారని అయన తెలిపారు. అయితే ప్రొఫెసర్ కోదండరాం నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల టీజేఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తారని టీజేఎస్ ఉపాధ్యక్షుడు విశ్వేశ్వరరావు తెలిపారు. ఇప్పటికే టి.ఆర్.ఎస్ ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పోయిందని వచ్చే పట్టభద్రుల ఎన్నికల్లో ప్రజలు వారికీ గట్టి బుద్ధి చెప్తారని అయన అన్నారు.