తెలంగాణ ప్రభుత్వం కరోన కట్టడిలో పూర్తి నిర్లక్ష్యం.. బీజేపీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లిన జనార్దన్ రెడ్డి

కరోన విషయమై కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన విషయాలను శ్వేత పత్రం ద్వారా ప్రజలకు తెలియజేయాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి, చేవెళ్ల పార్లమెంట్ ఇన్ చార్జి బి.జనార్దన్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం ఢీల్లీలో బాజేపీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నడ్డా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు , జాతీయ కార్యదర్శి సత్యకుమర్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ లతో పాటు జాతీయ పార్టీ నాయకులను కలిశారు. ఈ సందర్భంలో చేవెళ్ల పార్లమెంట్ అభివృద్ధి అంశాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కరోనాపట్ల వహిస్తున్నా నిర్లక్ష్యాన్ని ఆయన వారి దృష్టికి తీసుళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. టీఆర్ఎస్ ప్రభుత్వం కరోన విషయంలో పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. కేంద్ర కరోనా నియంత్రనకు కావాల్సినన్ని నిధులు ఇస్తున్నప్పటికి బీజేపీ పై నింద మోపే చర్యలకు టీఆర్ఎస్ పాల్పడుతుందని , ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం ఒక శ్వేత పత్రం విడుదల చేయలని ఆయన పేర్కోన్నారు. అప్పుడు నిజ నిజాలు ప్రజలకు తెలుస్తాయన్నార. రోజు రోజు విజృంభిస్తున్న కరోనా కట్టడికి కేంద్రంతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం పని చేసి కరోనాను అరికట్టవచ్చని ఆయన సూచించారు. జీహేచ్ఎంసీ పరిధీలో ఎంతో మంది ఈ కరోన వల్ల ఇబ్బందులు పడుతూ ప్రాణాలు పొగొట్టుకుంటున్నారని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా కరోనా విషయంలో తగు చర్యలు తీసుకోకపోతే మున్ముందు మరింత నష్టంత జరిగే అవకాశం ఉందని ఆయన తెలిపారు. అదే విధంగా చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలుపుకోలేకపోయిందని చేవెళ్ల పార్లమెంట్ లో 111 జీవో ఎత్తివేత అంశంతో పాటు సాగునీటిని ఈ ప్రాంత ప్రజలకు అందించే బాధ్యతను టీఆర్ఎస్ తీసుకోవాలని ఆయన కోరారు.

Leave a Reply

Your email address will not be published.