కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలి: చేవెళ్ల పార్లమెంట్ ఇంచార్జి జనార్ధన్ రెడ్డి

కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలి: చేవెళ్ల పార్లమెంట్ ఇంచార్జి జనార్ధన్ రెడ్డి

వికారాబాద్ జిల్లా, మర్పల్లి: రోజు రోజుకు తీవ్రంగా వ్యాపిస్తున్న కరోనాను కట్టడి చేయడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం నిమ్మకు నిరేత్తనట్టు వ్యవహరిస్తోందని చేవెళ్ల పార్లమెంట్ ఇంచార్జి బి.జనార్ధన్ రెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రతి పేదవాడికి మేరుగైన వైద్యం అందలని అయన అన్నారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి ప్రజల ఆరోగ్యలను కాపాడలని జనార్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఒక వేళ కరోనాను తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ లో చేర్చకపోతే కేంద్ర అందిస్తున్న ఆయుష్మాన్ భారత్ ను తెలంగాణలో అమలు చేయలని దాని ద్వారా ప్రతి ఒక్కరికి 5లక్షల ఆరోగ్య బీమా వర్తిస్తుందని జనార్ధన్ రెడ్డి సూచించారు. కరోన నేపధ్యంలో గవర్నమెంట్ ఆస్పత్రులపై నమ్మకం లేక ప్రయివేటు ఆస్పత్రులకు వెలితే అక్కడ లక్షలో ఫిజులు వసుల్లకు పాల్పడుతున్నాయి. ఇటు గవర్నమెంట్ ఆస్పత్రికి వెళ్లక అటు ప్రయివేటు ఆస్పత్రిలో డబ్బులు కట్టలేక దౌర్భగ్య స్థితిలో ఉన్నారని ఈ క్రమంలో కరోనాను ఆరోగ్యశ్రీ లో లేదా ఆయుష్మాన భారత్ లో చేర్చడం ద్వారా ప్రజలకు మేలు జరుగుతుందని జనార్ధన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి ఆస్పత్రుల్లో బెడ్లు కాలీ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురౌతుంటే కేసీఆర్ గారు మాత్రం కోన్ని కోట్లు ఖర్చు పెట్టి నూతన సచివాలయం నిర్మాణం చేపడుతున్నారు ఇప్పుడు ప్రజలకు కావాల్సింది సచివాలయం కాదు మేరుగైన వైద్యం అందించే ఆస్పత్రులు అని జనార్ధన్ రెడ్డి అన్నారు.

తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకంపోయిందని ప్రజలు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారని అయన ధీమ వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వికారాబాద్ నియోజకవర్గం, మర్పల్లి మండలంలో బీజేపీ నూతన పార్టీ కార్యాలయని బి. జనార్థన్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కర్ణం ప్రహ్లాద రావు, శివరాజ్ గారు, మాధవ్ రెడ్డి గారు,పాండు గౌడ్ గారు తదితర నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.