కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా #GiftASmile

వికారాబాద్ జిల్లా;

తెలంగాణ పురపాలక శాఖా మంత్రి, యువనేత కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్ర యూత్ వింగ్ ప్రధాన కార్యదర్శి N.శుభప్రధ్ పటేల్ నిర్వహించిన ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ముఖ్య అతిధిగా పాల్గొని వికారాబాద్ మునిసిపాలిటీ లో పనిచేస్తున్న సానిటరీ వర్కర్స్ కి మల్టీ విటమిన్ టాబ్లెట్ లను పంపిణీ చేశారు.

కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని కబళించిన ఈ పరిస్థితుల్లో ప్రజలందరూ ఒకరికొకరు తోడుగా ముందుకు నడవాలని పిలుపునిచ్చారు. భయం విడిచి కర్తవ్యం నిర్దేశించుకుని సాగాలన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ గార్ల నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం కరోనాని సమర్థంగా ఎదుర్కొంటున్నదని ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు.

కార్యక్రమంలో శుభప్రధ్ పటేల్ మునిసిపల్ చైర్పర్సన్ మంజులరమేష్, TRS టౌన్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి, మునిసిపల్ మాజీ చైర్మెన్ రమేష్ కుమార్, కౌన్సిలర్ అనంత్ రెడ్డి, సురేష్ గౌడ్, మాజీ జడ్పీటీసీ ముత్తర్ షరీఫ్, అప్ప విజయ్, శంకర్, దత్తు, రవీందర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, దోమ నర్సింహ రెడ్డి మొదలగువారు పాల్గొన్నారు…

Leave a Reply

Your email address will not be published.