ఈటల పర్యటనకు నిరసన సెగ… 

ఈటల పర్యటనకు నిరసన సెగ…

ఆర్.బి.ఎం బయ్యారం: ఉద్యోగుల నోటిఫికేషన్‌ రావడం లేదని ఇటీవల ఖమ్మంలో రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి ముత్యాల సాగర్‌ కుటుంబాన్ని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పరామర్శించారు. ఉద్యోగ నోటిఫికేషన్‌ జారీ చేసి విద్యార్థుల ఆత్మహత్యలను నివారించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ వెలువడక 11 ఏళ్లు అయ్యిందని గుర్తుచేశారు. మరోవైపు బయ్యారంలో ఈటల పర్యటనను నిరసిస్తూ ఉప్పలపాడు పంచాయతీ లక్ష్మీనరసింహాపురం గ్రామంలో వాటర్‌ ట్యాంక్‌ ఎక్కి టీఆర్‌ఎస్‌ నేతలు నిరసన తెలిపారు. అంతకుముందు విభజన హామీ మేరకు కేంద్ర ప్రభుత్వం బయ్యారంలో ఉక్క పరిశ్రమ నెలకొల్పాని డిమాండ్‌ చేస్తూ బయ్యారం బస్టాండ్‌ వద్ద టీఆర్‌ఎస్‌ నేతలు నల్లబ్యాడ్జీలతో రాస్తారోకో చేశారు.

Leave a Reply

Your email address will not be published.