హీట్ పెంచుతున్న తెలంగాణ రాజకీయాలు… రేవంత్‌‌పై కేటీఆర్‌ పరువు నష్టం దావా

హీట్ పెంచుతున్న తెలంగాణ రాజకీయాలు… రేవంత్‌‌పై కేటీఆర్‌ పరువు నష్టం దావా

హైదరాబాద్: తెలంగాణ రాజకీయాలు చాలా వేడిగా సాగుతున్నాయి. రేవంత్‌రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత టీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య మరీ హీట్ పెరిగింది. టీఆర్‌ఎస్‌ను రేవంత్‌రెడ్డి టార్గెట్ చేస్తున్నారు. గతంతో సీఎం కేసీఆర్‌పై విమర్శలు సంధించే రేవంత్.. ఇప్పుడు కేటీఆర్‌ను టార్గెట్‌గా చేసుకుని విమర్శలు సంధిస్తున్నారు. ఇప్పటివరకు సోషల్ మీడియా కేంద్రంగా సాగిన విమర్శలు ఇప్పుడు ప్రత్యక్షం రూపం తీసుకున్నాయి. సవాళ్లు ప్రతి సవాళ్లతో హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారి హీటెక్కింది. కేటీఆర్ విసిరిన సవాల్‌ను స్వీకరించి రేవంత్ గన్‌పార్క్‌కు చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే రేవంత్‌పై కేటీఆర్ పరువునష్టం దావా వేశారు. సిటీ సివిల్‌కోర్టులో రేవంత్‌రెడ్డిపై కేటీఆర్‌ పరువు నష్టం దావా వేశారు. తనకు సంబంధంలేని విషయాల్లో దురుద్దేశపూర్వకంగా.. తన పేరును వాడుతున్నారని కేటీఆర్‌ పిటిషన్‌‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం డ్రగ్స్‌ కేసులో ఈడీ ముందు విచారణకు హాజరవుతున్న.. వ్యక్తులతో కానీ ఆయా కేసులతో కానీ సంబంధం లేదని తెలిపారు. పరువు నష్టానికి తగిన పరిహారం చెల్లించడంతో పాటు క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని కేటీఆర్ కోర్టును కోరారు.

అంతకుముందు గన్‌పార్క్ కేంద్రంగా పెద్ద హైడ్రామా నడిచింది. కేటీఆర్‌ చెప్పిన విధంగా లైడిటెక్టర్‌ పరీక్షకు సిద్ధంగా ఉన్నానని, తమతో పాటు కేసీఆర్‌ కూడా సహారా, ఈఎస్‌ఐ స్కాం..
సీబీఐ కేసుల్లో లైడిటెక్టర్‌ టెస్ట్‌లకు వస్తారా? అని ప్రశ్నించారు. కేటీఆర్‌కు చాలెంజ్‌ విసిరిన రేవంత్ గన్‌పార్క్‌కు వచ్చారు. పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తల ఆందోళన చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, షబ్బీర్‌ అలీ, కార్యకర్తలు పాల్గొన్నారు. రేవంత్‌రెడ్డి వైట్‌ చాలెంజ్‌ను కేటీఆర్‌ స్వీకరించాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేశారు. రేవంత్‌రెడ్డి వైట్‌ చాలెంజ్‌ను స్వీకరిస్తున్నానని కొండా విశ్వేశ్వర్‌రెడ్డి చెప్పారు.

Leave a Reply

Your email address will not be published.