కేటీఆర్ నా వెంట్రుకతో సమానం: రేవంత్‌రెడ్డి

కేటీఆర్ నా వెంట్రుకతో సమానం: రేవంత్‌రెడ్డి
హైదరాబాద్: మంత్రి కేటీఆర్‌ను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మధ్య మాటల తూటాలు ఇంకా పేలుతూనే ఉన్నాయి. ఒకరిపై ఒకరు తీవ్రమైన విమర్శలు చేసుకుంటారు. కేటీఆర్ తన వెంట్రుకతో సమానమని రేవంత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. డ్రగ్స్ టెక్టుకు రావాలని కేటీఆర్ తాను అడుగలేదని చెప్పారు. కేటీఆర్ సవాల్‌ను తాను స్వీకరించానని, మరో ఇద్దరికి సవాల్ విసిరానని తెలిపారు. అందుకోసమే తాను గన్‌పార్క్ వద్దకు వచ్చానని తెలిపారు. గన్‌పార్క వద్ద రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్‌ను సూటిగా ప్రశ్నించారు. డ్రగ్స్ కేసులో ఐపీఎస్‌ అధికారి అకున్ సబర్వాల్ కమిటీ ఏమైంది? అని ప్రశ్నించారు. ఎక్సైజ్‌ విచారణ నివేదికను ఈడీ ఎందుకు ఇవ్వడం లేదు అని నిలదీశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖులను ఎవరు తప్పించారు? అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.

‘‘తెలంగాణలో డ్రగ్స్‌ కంట్రోల్‌ కోసం కేంద్ర సంస్థలకు ఫిర్యాదు చేశా. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా హైకోర్టులో కూడా ఫిర్యాదు చేశా. అన్ని ప్రభుత్వ శాఖలకు తెలంగాణ హైకోర్టు నోటీసులు ఇచ్చింది. డ్రగ్స్‌ టెస్టుకు సిద్ధమని కేటీఆర్‌ సవాల్‌ చేశారు. కేటీఆర్‌ సవాల్‌ను స్వీకరించకపోతే ప్రజలకు అనుమానం వస్తుంది. కేటీఆర్‌ మాటలకు నేను వైట్‌ చాలెంజ్‌ విసిరా’’ అని రేవంత్‌రెడ్డి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published.