గన్‌పార్క్‌కు రేవంత్ రెడ్డి..

గన్‌పార్క్‌కు రేవంత్ రెడ్డి..

హైదరబాద్: మంత్రి కేటీఆర్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిల మధ్య ట్విట్ల వార్ కొనసాగుతోంది. కేటీఆర్‌ లై డిటెక్టర్‌ టెస్టుకు పిలుపునివ్వడంతో రేవంత్ స్పందించారు. లైడిటెక్టర్‌ పరీక్షకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. తమతో పాటు కేసీఆర్‌ కూడా సహారా, ఈఎస్‌ఐ స్కాం.. సీబీఐ కేసుల్లో లైడిటెక్టర్‌ టెస్ట్‌లకు వస్తారా? అని రేవంత్‌ ప్రశ్నించారు. కేటీఆర్‌కు చాలెంజ్‌ విసిరిన నేపథ్యంలోనే రేవంత్ గన్‌పార్క్‌కు బయలుదేరారు. ఇప్పటికే మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి గన్‌పార్క్‌కు చేరుకున్నారు.

గ్రీన్ ఛాలెంజ్ మాదిరి మంత్రి కేటీఆర్, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి వైట్ ఛాలెంజ్ విసురుతున్నానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు గన్‌పార్క్ వద్దకు వస్తానని, వైట్ ఛాలెంజ్‌లో భాగంగా ఉస్మానియా ఆసుపత్రికి వెళ్దామని చెప్పారు. డ్రగ్స్ పరీక్షల కోసం వైద్యులకు నమూనాలు ఇద్దామని రేవంత్ సవాల్ విసిరారు.

తాను ఎలాంటి పరీక్షకైనా సిద్ధంగా ఉన్నానని, కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ సిద్దమేనా అని కేటీఆర్ సవాల్ విసిరారు. రాహుల్ ఒప్పుకుంటే ఢిల్లీలోని ఎయిమ్స్‌లో పరీక్షలకు సిద్ధమని ప్రకటించారు. చర్లపల్లి జైలుకు వెళ్లొచ్చిన వారితో తన స్థాయి కాదని, క్లిన్ చిట్ వస్తే రేవంత్ క్షమాపణ చెప్పి పదవులు వదులుకుంటారా .. ఓటుకు నోటు కేసులో లైడిటెక్టర్ పరీక్షకు సిద్దామా అని కేటీఆర్ ట్విట్టర్‌లో రేవంత్‌కు సవాల్ విసిరిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published.