జాతీయ స్థాయి బాక్సింగ్ పోటీలకు జింఖానా గ్రౌండ్ బాక్సర్లు..

జాతీయ స్థాయి బాక్సింగ్ పోటీలకు జింఖానా గ్రౌండ్ బాక్సర్లు..

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్:రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీలో తమ సత్తా చాటి జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడం పట్ల బాక్సింగ్ కోచ్ మనోజ్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర స్థాయిలో జరిగిన బాక్సింగ్ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభతో రాణించారని మనోజ్ రెడ్డి అన్నారు. కాగా ఈ నెల 26 న హర్యానా రాష్ట్రంలోని సోనేపట్ లో 4 వ జూనియర్ మెన్ నేషనల్ బాక్సింగ్ పోటీలు జరుగుతున్నాయని ఆ పోటీలో తమ బాక్సర్లు ఆడటం గర్వాంగా ఉందని మనోజ్ రెడ్డి పేర్కొన్నారు.రాష్ట్ర స్థాయిలో తమ ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయికి ఎంపిక అయినా వారిలో ఎస్.వార్షిత, కె.అశ్విని, బి.వైష్ణవి, ఎల్.అమూల్య,కె.హైమవతి, లక్ష్మి ప్రియా, పి.భార్గవి ఉన్నారని మనోజ్ రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో బాక్సింగ్ కోచ్ మనోజ్ రెడ్డి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన బాక్సర్లకు శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published.