కరోనా నిబంధనలను తుంగలో తొక్కిన కౌశిక్ రెడ్డి..

కరోనా నిబంధనలను తుంగలో తొక్కిన కౌశిక్ రెడ్డి..

ఆర్.బి.ఎం డెస్క్,హైదరాబాద్: పాడి కౌశిక్ రెడ్డి కరోనా నిబంధనలను తుంగలో తొక్కారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.గత కొద్ది రోజులుగా కరోనా రాష్ట్ర వ్యాప్తంగా తగ్గుముఖం పడుతున్న సందర్భంలో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. బుధవారం రోజు పాడి కౌశిక్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీలో చేరడానికి తన నివాసం గచ్చిబౌలి నుండి తెలంగాణ భవన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వందలాది మంది యువకులు పాల్గొన్నారు.ఈ భారీ ర్యాలీ వల్ల వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.వందలాది మంది యువకులతో భారీగా తీసిన ఈ ర్యాలీలో ఏ ఒక్కరూ కూడా కరోనా నిబంధనలను పాటించలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బహిరంగ ప్రదేశాల్లో తిరిగే వారు కచ్చితంగా మాస్కు ధరించాలి లేకపోతే పోలీసులు ఫైన్ విధించడంతో పాటు కేసు కూడా నమోదు చేస్తారని ఇదివరకే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.మరి ఈ ర్యాలీలో ఎంత మందికి ఫైన్ లు విధించారు అని ప్రతిపక్ష నాయకులు సైతం విమర్శలు చేస్తున్నారు.వందలాది మంది కరోనా నిబంధనలు లెక్క చేయకుండా రోడ్లపైకి వస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి.అధికారంలో ఉంటే ఏదైనా తమవైపు తిప్పు కోవచ్చు అనే దానికి ఉదాహరణ నిన్న కౌశిక్ రెడ్డి నిర్వహించిన భారీ ర్యాలీ అని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published.