అత్తాపూర్ లో స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయండి: టి.రాధాకృష్ణ, RDF ఫౌండర్ చైర్మన్
ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: నగర శివారు రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోని అత్తాపూర్ లో స్టడీ సర్కిల్ ఏర్పాటుకు కృషి చేయాలనీ రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కు RDF ఫౌండర్, చైర్మన్ టి.రాధాకృష్ణ వినతి పత్రం అందజేశారు. అనంతరం టి.రాధాకృష్ణ మీడియాతో మాట్లాడుతూ అత్తాపూర్ లో గల లైబ్రరీ వద్ద స్టడీ సర్కిల్ ఏర్పాటు
చేయాలనీ పోటీ పరీక్షల నేపథ్యంలో ఇది ఎంతో దోహదపడుతుందని ముక్యంగా ఈ స్టడీ సర్కిల్ వల్ల పేద విద్యార్థులకు చదువుకోవడానికి సులభంగా ఉంటుందని కొందరికి పుస్తకాలు కొని చదివే స్థోమత కూడా లేకపోవడంతో వారు అనుకున్న లక్ష్యానికి చేరుకోలేకపోతున్నారని రాధాకృష్ణ అన్నారు. డబ్బులు వెచ్చించి కోచింగ్ సెంటర్లకు పోలేనివారికి ఈ స్టడీ సర్కిల్ ఎంతగానో సహాయపడుతుందని అయన అన్నారు. బంగారు భవిష్యత్తు కు పునాదులు ఈ స్టడీ సర్కిల్ అని రాధాకృష్ణ అన్నారు. పేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని ఎమ్మెల్యే గారు స్టడీ సర్కిల్ ను అత్తాపూర్ లో ఏర్పాటు చేయాలను రాధాకృష్ణ కోరారు.