వైఎస్ఎస్ ధ్యానకేంద్రంలో ఘనంగా గురుపూర్ణిమ వేడుకలు

వైఎస్ఎస్ ధ్యానకేంద్రంలో ఘనంగా గురుపూర్ణిమ వేడుకలు

ఆర్.బి.ఎం   హైదరాబాద్: బేగంపేటలోని యోగదా సత్సంగ ధ్యానకేంద్రంలో గురుపూర్ణిమ వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకూ భజనలు, ధ్యానమూ, గురువుల సాహిత్య పఠనం కొనసాగాయి. మధ్యాహ్నం ఒంటిగంటకు భోజన ప్రసాదం తర్వాత రెండుంబావు నుంచి మూడుంబావు వరకూ భజనలు చేశారు. 3 గంటలా 45 నిమిషాల నుంచి ఆరు గంటల వరకూ శక్తిపూరక వ్యాయామాలు, ధ్యానం పూర్తయ్యాక చివర్లో పుష్పాంజలి నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా భక్తులు వైఎస్ఎస్ వ్యవస్థాపకులైన పరమహంస యోగానంద చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.

అంతకుముందు ఉదయం 6 గంటల నుంచి ఎనిమిదిన్నర వరకూ రాంచీ నుంచి గురుపూర్ణిమ కార్యక్రమాలను భక్తులు ప్రత్యక్షంగా వీక్షించారు.

గురుపూర్ణిమ సందర్భంగా ఒక యోగి ఆత్మకథ పుస్తకంపై 50 శాతం డిస్కౌంట్ అందించారు. గురుపూర్ణిమ వేడుకలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరుకావడంపై బేగంపేట వైఎస్ఎస్ ధ్యానకేంద్ర కమిటీ హర్షం వ్యక్తం చేసింది.

Leave a Reply

Your email address will not be published.