ఆలయాలను అభివృద్ధి చేయడంలో తెరాస ప్రభుత్వం ముందుంది: పద్మారావు గౌడ్

ఆలయాలను అభివృద్ధి చేయడంలో తెరాస ప్రభుత్వం ముందుంది: పద్మారావు గౌడ్

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: బోనాలు వేడుకలకు ఎంతో ప్రాముఖ్యత ఉందని, ప్రస్తుత సంవత్సర బోనాలు వేడుకలను కోవిడ్ నిబంధనలు పాటిస్తూనే ఘనంగా జరుపుకోవాలని ఉప సభాపతి తీగల్లా పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ కు సంబంధించిన అడ్డగుట్ట, బౌద్ద్దనగర్, సీతాఫలామండీ, మెట్టుగూడ, తార్నాక డివిజన్లకు సంబంధించిన దాదాపు 185 దేవాలయాలకు రూ. 85 లక్షలకు పైగా విలువ చేసే చెక్కులను ఆలయాల నిర్వాహకులకు అయన మంగళవారం సీతాఫలామండీ క్యాంపు కార్యాలయంలో అందించారు. కట్ట మిటమ్మా దేవాలయానికి రూ 10 లక్షల చెక్కును అందించారు. ఈ సందర్బంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ ఆలయాల అభివృద్ధికి సహకరిస్తామని తెలిపారు. అన్ని మతాలకు తెరాస ప్రభుత్వం తగిన ప్రాముఖ్యతను కలిగిస్తోంది తెలిపారు. తమ హయాంలో కట్ట మైసమ్మ దేవాలయానికి రూ. 37 లక్షల మేరకు నిధులను సమకూర్చడం ఆనందాన్ని కలిగిస్తోందని పద్మారావు గౌడ్ పేర్కొన్నారు. కార్పొరేటర్లు, అధికారులు, నాయకులూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.