గులాబ్’ తుఫాన్ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండండి: మాదిరెడ్డి నర్సింహారెడ్డి, దమ్మాయిగూడా కౌన్సిలర్..

గులాబ్’ తుఫాన్ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండండి: మాదిరెడ్డి నర్సింహారెడ్డి, దమ్మాయిగూడా కౌన్సిలర్..

ఆర్.బి.ఎం దమ్మాయిగూడా: బంగాళాఖాతంలో ఏర్పడిన ‘గులాబ్’ తుఫాన్ దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం హైఅలర్ట్ అయింది. నేడు, రేపు జీహెచ్ఎంసీ హైఅలర్ట్ ప్రకటించింది. గులాబ్‌ తుఫాను ప్రభావంతో రాష్ట్రంలో సోమవారం, మంగళవారం భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. హైదరాబాద్‎తో పాటు రాష్ట్రంలో పలు చోట్ల వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది.

దమ్మాయిగూడా కౌన్సిలర్ నర్సింహారెడ్డి మాట్లాడుతూ గులాబ్’ తుఫాన్  నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని,అవసరం ఉంటే తప్ప బయటకు వెళ్ళొదంటూ ప్రజలకు పిలుపునిచ్చారు.లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వరద నీరు ఇంట్లోకి వస్తే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అయన సూచించారు. వర్షాల వల్ల ఎదురయ్యే సమస్యలను ఎదుర్కోవడానికి దమ్మాయిగూడాలో ఎమర్జెన్సీ టీంను ఏర్పాటు చేశామని వార్డుల్లో వర్షాల వల్ల ఏదైనా సమస్య వస్తే నర్సింహా రెడ్డి (కౌన్సిలర్): 9494267373 ,హరీష్: 9666703077 ,అశోక్: 99481 89096 ఫోన్ నంబర్లకు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని దమ్మాయిగూడ కౌన్సిలర్ నర్సింహా రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.

Leave a Reply

Your email address will not be published.