ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో ఊహించని షాకిచ్చిన కేసీఆర్

ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో ఊహించని షాకిచ్చిన కేసీఆర్

ఆర్.బి.ఎం  హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎంపికలో సీఎం కేసీఆర్ ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. అభ్యర్థుల ఎంపికలో ఎంపీ బండి ప్రకాష్ పేరు కొత్తగా తెరపైకి వచ్చింది. ప్రకాష్‌ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించిన అందరికీ షాకిచ్చారు. ప్రస్తుతంగా ప్రకాష్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఎంపీగా ఉన్న  ఆయనను ఎమ్మెల్సీగా మండలికి ఎందుకు పంపాల్సి వచ్చిదనే అనుమానం అందరినీ వెంటాడుతోంది.

దీనికి కేసీఆర్ వద్ద ఓ లెక్క ఉందట. అదేంటంటే ప్రకాష్‌ను ఎమ్మెల్సీగా ఎంపిక చేసి ఆ తర్వాత మంత్రిను చేయాలని కేసీఆర్ సంకల్పించారని గులాబీ నేతలు చెబుతున్నారు. మొత్తం ఆరుగురు ఎమ్మెల్సీ అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించారు. బండా ప్రకాష్ , రవీందర్‌రావు, వెంకట్రామిరెడ్డి, కడియం శ్రీహరి, గుత్తా సుఖేందర్ రెడ్డి, కౌశిక్ రెడ్డిల ఎంపిక చేశారు. ప్రకాష్‌ను త్వరలోనే ఎంపీ స్థానానికి రాజీనామా చేస్తారని చెబుుతున్నారు. ఖాళీ అయిన ఎంపీ స్థానాన్ని మాజీ స్పీకర్ మధుసూదనాచారితో భర్తీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది.

Leave a Reply

Your email address will not be published.