హోండా యాక్టివాకు 117 చలాన్లు..ఖంగుతిన్న పోలీసులు ..

హోండా యాక్టివాకు 117 చలాన్లు.. ఖంగుతిన్న పోలీసులు

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఓ వాహానానికి 117 చలాన్లు పడ్డాయి. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో హోండా యాక్టివా 117 పెండింగ్ చలాన్లున్నట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ కలెక్టరేట్ ఎదురుగా పోలీసులు తనిఖీలు చేపట్టారు.హోండా యాక్టివా  117 చలాన్లు ఉన్నట్లు గుర్తించారు. ఇన్ని చలాన్లు చూసిన పోలీసులు ఖండగుతిన్నారు. ఈ చలాన్ల ఖరీదు 30 వేలు ఉన్నట్లు పోలీసులు చెబుున్నారు. వాహాన్ని పోలీసులు సీజ్ చేశారు. వాహనదారుడిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.

వాహనదారులు బండి ఎక్కితే చాలు దూసుకుపోతుంటారు. ఇలా ఇష్టం వచ్చినట్లు వాహనంపై దూసుకుపోయే వాహనదారులు ఏమాత్రం ట్రాఫిక్ నియమాలు పాటించరు. నెత్తిపై హెల్మెట్ ఉందా లేదా అనే విషయాన్ని కూడా మర్చిపోతారు. ఏదో కొంపలు మునిగిపోయినట్లు ఫోన్లలో తెగ బిజీగా మాట్లాడుతుంటారు. ఇలాంటి వారు ఏమాత్రం ట్రాఫిక్ రూల్స్ పాటించరు. సిగ్నల్ జంప్ చేయడం, రాంగ్ రూట్లలో ప్రయాణిస్తూ తోటి వాహనదారులకు ఇబ్బందులు తీవ్రమైన ఇబ్బందులకు గురిచేస్తూ ఉంటారు.

Leave a Reply

Your email address will not be published.