పరమేశ్వరుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి: బి.జనార్దన్ రెడ్డి, చేవెళ్ల పార్లిమెంట్ బీజేపీ ఇంచార్జి

పరమేశ్వరుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి: బి.జనార్దన్ రెడ్డి, చేవెళ్ల పార్లిమెంట్ బీజేపీ ఇంచార్జి

ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపిన చేవెళ్ల పార్లిమెంట్ బీజేపీ ఇంచార్జి బి.జనార్దన్ రెడ్డి..

ఆర్.బి.ఏ. డెస్క్ హైదరాబాద్: పరమేశ్వరుని ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని చేవెళ్ల పార్లిమెంట్ బీజేపీ ఇంచార్జి బి.జనార్దన్ రెడ్డి ఆకాంక్షించారు. శివం అంటే చైతన్యమని, శివుడి నుంచే యోగ సంప్రదాయం వచ్చిందని తరతరాల విస్వాశమని ఆయన గుర్తు చేశారు. శివుడు లింగాకారంలో ఉద్భవించిన రోజు శివరాత్రి అని తెలిపారు. శివతత్వం అనుసరణీయమన్నారు. అభిషేకప్రియుడైన శివుడు ఆది దేవుడని, కోరిన వరాలిచ్చే బోళాశంకరుడని ఆయన అభివర్ణించారు. హర హర మహాదేవ ఘోషలతో మారుమ్రోగాలని ఆయన ఆకాంక్షించారు. శివరాత్రి ఉపవాస పూజలను భక్తి ప్రవత్తులుతో నిర్వహిస్తున్న భక్తులుకు, ప్రజలకు భోళా శంకరుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, ప్రజలకు సుఖ సంతోషాలును, భోగ భోగ్యాలను, శాంతిని ప్రసాదించాలని ప్రార్థిస్తూ.ఈ సందర్భంగా చేవెళ్ల పార్లిమెంట్ బీజేపీ ఇంచార్జి బి. జనార్దన్ రెడ్డి మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published.