షర్మిలకు పీకే శిష్యులే దిక్కయ్యారా?

షర్మిలకు పీకే శిష్యులే దిక్కయ్యారా?

ఆర్.బి.ఎం హైదరాబాద్: తెలంగాణలో రాజన్న రాజ్యం స్థాపించాలని వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి షర్మిల ఊవ్విళ్లూరుతున్నారు. ఇప్పటికే ఆమె ప్రజాక్షేత్రంలోకి వెళ్లారు. అన్ని జిల్లాల కమిటీలను కూడా ఏర్పాటు చేసుకున్నారు. దీక్షల పేరుతో ప్రజలకు దగ్గరయ్యేందుకు షర్మిల ప్రయత్నాలు చేస్తున్నారు. ఓ వైపు రాజకీయ కార్యక్రమాలో పాటు వ్యూహకర్తలను కూడా ఆమె ఆశ్రయిస్తున్నారు. వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, వైఎస్ఆర్‌టీపీకి వ్యూహకర్తగా పనిచేస్తారనే ప్రచారం జరిగింది. అందులోభాగంగా షర్మిల ప్రశాంత్ కిషోర్ టీంతో ఓ దప సమావేశమయ్యారు. పార్టీ విస్తరణ, పాదయాత్ర, పార్టీ బలోపేతం తదితర అన్ని అంశాలపై చర్చించారని ఆపార్టీ నేతలు చెప్పారు.

అయితే అదిగో ఇదిగో పీకే తెలంగాణకు వస్తున్నారని విస్తృతంగా ప్రచారం జరిగింది. అయితే పీకే, వైఎస్ఆర్‌టీపీకి కాకుండా టీఆర్‌ఎస్‌కు వ్యూహకర్తగా పనిచేయబోతున్నారు. తెలంగాణలో ఆయన పర్యటించారు కూడా. దాదాపుగా పీకే, టీఆర్‌ఎస్‌ కోసం పనిచేయడం ఖాయమైంది. అయితే ఆ పార్టీ అధికారికంగా ప్రకటించలేదు. పీకే, టీఆర్‌ఎస్‌కు పనిచేస్తున్నారు. మరీ వైఎస్ఆర్‌టీపీ సంగతి ఏమిటనే చర్చ నడుస్తోంది. ఇంకా షర్మిలకు పీకే శిష్యులే దిక్కయ్యారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పీకే శిష్యులు షర్మిలను విజయతీరాలకు చేర్చుతారో లేదో వేచి చూడాలి.

Leave a Reply

Your email address will not be published.