పరమశివుడు సర్వాంతర్యామి: బి.జనార్దన్ రెడ్డి,చేవెళ్ల పార్లిమెంట్ బీజేపీ ఇంచార్జి

పరమశివుడు సర్వాంతర్యామి: బి.జనార్దన్ రెడ్డి,చేవెళ్ల పార్లిమెంట్ బీజేపీ ఇంచార్జి

మహేశ్వరం నియోజకవర్గంలోని రాజరాజేశ్వరి మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన చేవెళ్ల పార్లిమెంట్ బీజేపీ ఇంచార్జి బి.జనార్దన్ రెడ్డి..

ఆర్.బి.ఎం మహేశ్వరం: పరమశివుడు సర్వాంతర్యామి అని చేవెళ్ల పార్లిమెంట్ బీజేపీ ఇంచార్జి బి.జనార్దన్ రెడ్డి అన్నారు. మహాశివరాత్రి సంధర్బంగా మహేశ్వరం నియోజకవర్గంలోని రాజరాజేశ్వరి మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత జనార్దన్ రెడ్డి, జిల్లా బీజేపీ అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి దంపతులకు ఆలయ నిర్వాహకులు స్వాగతం పలికి వారి చేత పూజలు గావింప చేసి, తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వదించారు.

ఈ సందర్భంగా బి.జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ మహాశివరాత్రి రోజున పాటించే జాగరణ నిరంతర చైతన్యానికి ప్రతీక అని అన్నారు. పవిత్రమైన మహాశివరాత్రిని సంతోషకరమైన వాతావరణంలో భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఆయన కోరారు. హర హర మహదేవుడైన శివుడి కరుణా కటాక్షాలుతో ప్రజలందరూ, ఆయురారోగ్యాలతో , సుఖ సంతోషాలతో ఉండాలని చేవెళ్ల పార్లిమెంట్ బీజేపీ ఇంచార్జి బి.జనార్దన్ రెడ్డి ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో సుదర్శన్ రెడ్డి, పాపయ్య గౌడ్,  మండల అధ్యక్షుడు మాధవ చారి, సుదర్శన్ యాదవ్, శ్రవణ్, గ్రామ ప్రజలు,నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.